చిగురుమళ్ళ శ్రీనివాస్ 100 దేశాల శాంతియాత్ర అభినందనీయం

- Advertisement -

చిగురుమళ్ళ శ్రీనివాస్ 100 దేశాల శాంతియాత్ర అభినందనీయం
బెహ్రాయిన్ ఇండియన్ అంబాసిడర్
దోహ
బెహ్రాయిన్  లో  తానా ప్రపంచ సాహిత్య వేదిక కన్వీనర్  చిగురుమళ్ళ శ్రీనివాస్ నిర్వహిస్తున్న 100 దేశాలలో శాంతి సద్భావనా ప్రపంచ యాత్ర ఘనంగా జరిగింది.  తెలుగు కళా సమితి – బెహ్రాయిన్
అధ్యక్షులు  తక్కెళ్ళపాటి హరిబాబు, పూర్వ అధ్యక్షులు శివ యెల్లపు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో వందలాది మంది ప్రవాస తెలుగువారు పాల్గొన్నారు.
బెహ్రాయిన్ లోని ఇండియన్ అంబాసిడర్  వినోద్ కే జాకబ్ మాట్లాడుతూ 100  దేశాలలో శాంతి యాత్ర నిర్వహిస్తూ, మానవాళి ని చైతన్య పరచరడం అభినందనీయం అన్నారు. దీనిలో భాగంగా అమ్మ నాన్న గురువు శతక పద్యార్చన, మొక్కనాట వోయి ఒక్కటైన లాంటి కార్యక్రమాలు నిర్వహించడం భావి తరాలకు ఎంతో అవసరం, వీరి కృషి శ్లాఘనీయం అన్నారు. టీకేఎస్  అధ్యక్షుడు  హరిబాబు మాట్లాడుతూ ప్రపంచ మానవాళికి శాంతి సందేశాన్ని అందించడానికి, విశ్వ మానవ సౌభ్రాతృత్వాన్ని చాటటానికి సాహిత్యం ద్వారా సామాజిక చైతన్య కలిగించడానికి  శ్రీనివాస్  “వందే విశ్వమాతరమ్” పేరుతో వంద దేశాల శాంతి సద్భావనా యాత్ర నిర్వహించటం అభినందనీయమని అన్నారు.
చిగురుమళ్ళ మాట్లాడుతూ తానా మరియు 100 దేశాలలో ఉన్న వందకు పైగా తెలుగు సంఘాల సమన్వయంతో తానా అధ్యక్షులు నిరంజన్ శృంగవరపు, వందేవిశ్వ మాతరమ్ చైర్మన్ జయశేఖర్ తాళ్ళూరి సారథ్యంలో ఈ బృహత్ అక్షర యజ్ఞం జరుగుతోంది.
నవంబర్ తొమ్మిదో తారీఖున బోట్స్ వానాలో ప్రారంభించి, ఆఫ్రికా ఖండంలోని దేశాల యాత్ర అనంతరం రెండవ దశలో భాగంగా మధ్య ప్రాచ్య  దేశాల శాంతి యాత్ర నిర్వహిస్తున్నాము. మానవ ప్రవర్తనలో పరివర్తన తీసుకురావడం సాహిత్యం ద్వారా  సాధ్యమవుతుందని అన్నారు. మధ్య ప్రాచ్య దేశాల యాత్ర కన్వీనర్ లుగా సుధాకర్ కుదరవల్లి, విక్రమ్ సుఖవాసి వ్యవహరిస్తున్నారు. ఆత్మీయ సమ్మేళనంలో ఫనిభూషణరెడ్డి .టి, వంశీధర్. జి, ప్రవీణ్ సీ. హెచ్, ఫణి హనుమంతరావు,  విజయేంద్ర రెడ్డి, రామ శ్రీను, శ్రీనివాస్ రెడ్డి. సి  తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular