Sunday, September 8, 2024

 పిల్లల పెంపకం తల్లిదండ్రుల అధ్బుతమైన కళ

- Advertisement -

 పిల్లల పెంపకం తల్లిదండ్రుల అధ్బుతమైన కళ

పెద్దపల్లి
పట్టణంలోని సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో  వసంత పంచమి సామూహిక అక్షరాభ్యాస మహోత్సవంలో ,సర్కిల్ ఇన్స్పెక్టర్  కృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ నేటి సమాజంలో పిల్లల పెంపకం తల్లిదండ్రుల అధ్బుతమైన కళ అని కొనియాడారు.  ప్రతి పేరెంట్ ఆశయాలు పిల్లలు ఎదిగి వారికి సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న సందర్భంలో నెరవేరుతుందని అన్నారు.చిన్ననాటి నుంచి పిల్లలను సంస్కారవంతులుగా తయారు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. పిల్లలలో వాళ్ల అవసరాలను గుర్తించి సంపూర్ణ మూర్తిమత్వ వికాసము సాధించడానికి పాఠశాల ఉపయోగపడుతుందని తెలిపారు.పిల్లవాడిని ప్రయోజకుడిగా చేయడానికి మనవంతుగా వారి శారీరక ఆరోగ్యానికి సమతుల్య ఆహారము అందిస్తూ,ఆహ్లాదకరమైన గృహా వాతావరణము కుటుంబసభ్యులు అందించాలని కోరారు. ఈ సందర్భంగా ఆచార్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో  అక్షరాభ్యాసంలో పాల్గొన్న ప్రతి చిన్నారిని ఆశీర్వదిస్తూ, ప్రోత్సాహక బహుమతి అందించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్.విజయ, కావేటి రాజగోపాల్, శశాంక్, డాక్టర్ జవ్వాజి రాజేష్, రవీందర్, వేణు, మూర్తి, ప్రధానాచార్యులు మంజుల తో పాటు అనేకమంది పిల్లలు & పోషకులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్