- Advertisement -
చంద్రుడి మట్టితో చైనా కీలక పరిశోధన
Jun 25, 2024,
చంద్రుడి మట్టితో చైనా కీలక పరిశోధన
లూనార్ ల్యాండర్ చాంగే-6 తీసుకొచ్చిన నమూనాల్లో 2.5 మిలియన్ ఏళ్లనాటి పురాతన అగ్నిపర్వత శిలలు కూడా ఉండొచ్చని చైనా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ నమూనాలను అధ్యయనం చేస్తే చంద్రుడికి రెండు వైపులా ఉన్న భౌగోళిక వ్యత్యాసాలకు సంబంధించి పలు ప్రశ్నలకు సమాధానం దొరుకుతుందని విశ్వాసంగా ఉన్నారు. చంద్రుడి రెండు ప్రాంతాలు పూర్తిగా భిన్నమని రిమోట్ సెన్సింగ్ పరిశీలనల్లో వెల్లడైంది. ఈ అంశాన్నే చైనా శాస్త్రవేత్తలు పరిశీలించనున్నారు.
- Advertisement -