ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి ని మర్యాద పూర్వకంగా కలిసిన చున్నుపాషా

- Advertisement -
Chunnu Pasha met Chief Minister Revanth Reddy as a courtesy

కూకట్ పల్లి : ఏప్రిల్ 1(వాయిస్ టుడే)
మూసా పేట డివిజన్ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు చున్ను పాషా ఆదివారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. సీఎం రేవంత్ రెడ్డిని శాలువా తో సత్కరించి టోపీ పెట్టి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చున్ను పాషా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే పేద ప్రజలకు న్యాయం జరుగుతుందని అన్నారు. ఇప్పటికే హామీ ఇచ్చిన ఎన్నో సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయని, అనతి కాలంలో నే పథకాలు పేద ప్రజలకు చేరేలా చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి హయాంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పధం వైపు నడుస్తుంది అని, ఆయన అడుగు జాడల్లో రాష్ట్ర అభివృద్ధికి, పార్టీ పటిష్టత కు కృషి చేస్తామని అన్నారు. నియోజకవర్గ అభివృద్ధి లో నియోజకవర్గం ఇంచార్జీ బండి రమేష్ వెంట ఉంటామని అన్నారు. రంజాన్ మాసంలో తాను నిర్వహించే ఇఫ్తార్ విందు కు ఆహ్వానించాను అని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు టీంకు, హైమ్మధ్ , మధన్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular