విద్యార్థులకు పదో తరగతి కీలకం
Class 10 is crucial for students
ప్రతి ఒక్క విద్యార్థి 10వ తరగతి పరీక్షల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించాలి
జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా
పత్తికొండ
విద్యార్థులకు పదో తరగతి కీలకమని, ప్రతి ఒక్క విద్యార్థి 10వ తరగతి పరీక్షల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా 10 వ తరగతి విద్యార్థులకు సూచించారు.శనివారం పత్తికొండ మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం, డా.బిఆర్.అంబేద్కర్ గురుకుల బాలికల కళాశాలల ను ఎమ్మెల్సీ బీటీ నాయుడు,పత్తికొండ ఎంఎల్ఏ కెఈ శ్యామ్ బాబు తో కలిసి కలెక్టర్ పరిశీలించారు.ఈ సందర్భంగా కలెక్టర్ పదవ తరగతి విద్యార్థులతో ముచ్చటిస్తూ పదవ తరగతి వmవిద్యార్థులు పదవ తరగతి పబ్లిక్ పరీక్షలలో 100 శాతం ఉత్తీర్ణత సాధించాలని కలెక్టర్ తెలిపారు.. సైన్స్, గణితం సబ్జెక్ట్ లలో సిలబస్ ఎంతవరకు పూర్తి చేశారని కలెక్టర్ అక్కడే ఉన్న సైన్స్, గణితం టీచర్లను అడిగి తెలుసుకున్నారు … వర్చువల్ క్లాస్ లు ఏ విధంగా జరుగుతున్నాయి, సబ్జెక్ట్ అర్థం అవుతుందా అని కలెక్టర్ విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు… ఉపాధ్యాయులు చెప్పే సబ్జెక్ట్ లలో ఏమైనా అర్థం అవ్వకపోయినా, లేదంటే క్లాసులు మిస్సయనా క్లాస్ రూమ్ లో ఉన్న ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానెల్ లలో, యూ ట్యూబ్ లో చూసి సబ్జెక్ట్ ను అర్థం చేసుకోవాలని కలెక్టర్ విద్యార్థులకు సూచించారు…కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం వంట గదిలో గ్యాస్ వినియోగించడం పట్ల కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. బియ్యాన్ని పరిశీలించారు.. వంటగది, టాయిలెట్స్ మెయింటెనెన్స్ ను చూసి కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు… అదే విధంగా మంజూరైన కస్తూర్బా జూనియర్ కళాశాల కోసం స్థలాన్ని పరిశీలించాలని కలెక్టర్ పత్తికొండ ఆర్డీఓను ఆదేశించారు.పత్తికొండ ఎమ్మెల్యే మాట్లాడుతూ పదవ తరగతి విద్యార్థులు ఎవరైతే 90 శాతం మార్కులు సాధిస్తారో వారికి ఉచితంగా ల్యాప్ టాప్ లు అందచేసే విధంగా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే తెలిపారు…
ఇంటర్మీడియట్ పరీక్షలకు సంసిద్దులు కావాలి
డా.బిఆర్.అంబేద్కర్ గురుకుల బాలికల కళాశాల విద్యార్థినులతో కలెక్టర్ మాట్లాడుతూ ఇంటర్మీడియట్ పరీక్షలు త్వరలో జరగనున్నాయని, పూర్తి స్థాయిలో ప్రిపేర్ కావాలని సూచించారు.. విద్యార్థులు అందరూ బాగా కష్టపడి చదివి ఫస్ట్ క్లాస్ లో పాస్ కావాలన్నారు. ఉన్నత స్థాయిలో ఉన్న వారిని స్ఫూర్తిగా తీసుకొని, మీరు కూడా అదే విధంగా జీవితంలో పైకి రావాలని కలెక్టర్ ఆకాంక్షించారుడా.బి.ఆర్.అంబేద్