- Advertisement -
బ్యాంక్ రుణాల్లో వర్గీకరణ అవసరం
Classification is necessary in bank loans
గుంటూరు
బ్యాంక్ రుణాల్లో వర్గీకరణ అవసరమని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ చెప్పారు. గుంటూరులో మాట్లాడుతూ … ఉద్యోగాల కోసం ఎస్సి వర్గీకరణ కాకుండా దళితులు, బిసిలు, ఆదివాసీలు వ్యాపారాల్లో రాణించేందుకు బ్యాంకులు సహకరించ డం లేదన్నారు. అగ్ర కులాలకు చెందిన వారికి రుణాలు ఇస్తున్నా రని, చెల్లించక పోయినా మాఫీ చేస్తున్నారని ధ్వజమెత్తారు. సుప్రీం కోర్టు జడ్జీల పోస్టుల్లో వర్గీకరణ కావాలన్నారు. ప్రభుత్వ కాంట్రాక్టుల్లో వర్గీకరణ, సామాజిక న్యాయం జరగాలని కోరారు. 33 మంది సుప్రీం కోర్టు జడ్జీలుంటే, ఒకే సామాజిక తరగతి వారు 20 మంది సుప్రీంకోర్టు జడ్జీలుగా ఉన్నారన్నారు. అమరావతి కోర్టులో ఎంత మంది ఎస్సి, ఎస్టి, ఒబిసి జడ్జీలున్నారని ప్రశ్నించారు. సిఆర్డిఎ కాంట్రాక్ట్ పనుల్లో ఎంతమందికి ఎస్సి, ఎస్టి, ఒబిసిలకు ఇచ్చారు? ఇక్కడ వర్గీకరణ కావాలన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనకు దళిత విభజనే కారణం అన్నారు. దళిత విభజన జోలికిపోతే చంద్రబాబు నష్టపోతారని, లోకేష్ కంటున్న కలలు కలలుగానే మిగులుతాయని పేర్కొన్నారు.
- Advertisement -