హైదరాబాద్, మే 21 (వాయిస్ టుడే)
తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల కోసం లక్షలాది మంది ఎదురు చూస్తున్నారు. గత కొన్నేళ్ల నుంచి కొత్త రేషన్ కార్డులు లేక ఇబ్బందులు పడ్డారు. అయితే మీరు కూడా కొత్తరేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నట్లయితే మీకో శుభవార్త. కొత్త రేషన్ కార్డులపై తెలంగాణ సర్కార్ త్వరలో కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. అయితే ప్రకటన చేసినట్లయితే ఎంతో మందికి ఊరట కలుగనుందనే చెప్పాలి. గత ప్రభుత్వ హయాంలో కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామని చెప్పినా ఇప్పటి వరకు ఎలాంటి కార్డులు జారీ కాలేదు. దీంతో ప్రజల నుంచి వ్యతిరేకత చాలా ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.ఇటీవల తెలంగాణలో అధికారంలోకి వచ్చిన రేవంత్‌రెడ్డి సర్కార్ కొత్త రేషన్ కార్డుల జారీకి శ్రీకారం చుట్టనుంది. అయితే ఎన్నికల కోడ్ ఉన్నందున కొత్త రేషన్ కార్డుల అంశం జాప్యమవుతోంది. కొత్త రేషన్ కార్డుల కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పే అవకాశాలు ఉన్నాయి. త్వరలో కొత్త రేషన్ కార్డులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.త్వరలోనే కొత్త రేషన్ కార్డులను జారీ చేయనున్నట్లు ఇటీవల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. తన సొంత నియోజకవర్గం పాలేరులో ప్రజల వద్దకే మంత్రి పొంగులేటి కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా పొంగులేటి మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రకటించిన విధంగానే ఆరు గ్యారంటీలు అమలు చేసి తీరుతామని, కొత్త రేషన్ కార్డుల జారీకి శ్రీకారం చుట్టనున్నట్లు చెప్పారు.అంతేకాకుండా ఇందిరమ్మ ఇళ్లపై కూడా కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. రాష్ట్రంలో ఇళ్లు లేని ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఇందిరమ్మ ఇళ్లతో పాటు త్వరలోనే అర్హులు అందరికీ కొత్త పెన్షన్లు, పెంచిన పెన్షన్లు, కొత్త రేషన్ కార్డులు ఇస్తామని ఆయన తెలిపారు. దీంతో వీటన్నింటిపై రాష్ట్ర ప్రజలు ఎంతగానో ఆశలు పెట్టుకున్నారు. అలాగే పాలేరు నియోజకవర్గం తన సొంత ఇల్లు అని, ఎన్నికల కోడ్ ముగియగానే నియోజకవర్గంలో అభివృద్ధి పనులు మొదలు పెడాతానని వెల్లడించారు.
రేషన్ కార్డులకు లైన్ క్లియర్
- Advertisement -
- Advertisement -