- Advertisement -
సోమవారం సీఎం చంద్రబాబు పోలవరం పర్యటన
CM Chandrababu's visit to Polavaram on Monday
పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ
ఏలూరు
పోలవరం ప్రాజెక్ట్ పనుల పరిశీలనకు సోమవారం సిఎం చంద్రబాబునాయుడు జిల్లాకు రానున్నారు. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పోలవరం ప్రాజెక్ట్ ప్రాంతంలో అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ శనివారం పరిశీలించారు.
సీఎం పర్యటనలోఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా క్షుణ్ణంగా పర్యవేక్షణ చేయాలని పోలీసు అధికారులకు తగిన మార్గదర్శకాలను జారీ చేశారు. ముఖ్యంగా, సమావేశ ప్రాంగణంలో ట్రాఫిక్ నియంత్రణ, సందర్శకుల అనుమతులు, అత్యవసర సేవల కోసం ప్రత్యేక ఏర్పాట్లపై దృష్టి పెట్టాలని సూచించారు. అదేవిధంగా భద్రతా చర్యల్లో భాగంగా ప్రతి అంశాన్ని పర్యవేక్షించి, సమర్థంగా నిర్వహించాలని ఇతర డిపార్ట్మెంట్ అధికారులతో సమన్వయం చూసుకుంటూ ముఖ్యమంత్రిపర్యులు పర్యటన ఆద్యంతం ఎటువంటి ఇబ్బందులు లేకుండా అధికారులు సమిష్టిగా బందోబస్తు నిర్వహించాలని జిల్లా ఎస్పీ సూచించారు.
- Advertisement -