11.1 C
New York
Wednesday, February 28, 2024

గోల్కొండ కోటలో జాతీయ జెండాను ఎగురవేసిన సీఎం కేసీఆర్

- Advertisement -
CM KCR hoisted the national flag at Golconda Fort
CM KCR hoisted the national flag at Golconda Fort

ఎన్నికలకు కేసీఆర్ 1000 కోట్ల వరాలు

హైదరాబాద్, ఆగస్టు 15, (వాయిస్ టుడే):  తెలంగాణ లో 77వ స్వాతంత్ర దినోత్సవం ఘనంగా సాగుతున్నాయి. రాష్ట్ర ముఖ్మమంత్రి కేసీఆర్..  గోల్కొండ కోటలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. రాణి మహల్ ప్రాంగణంలో సీఎం కేసీఆర్ జాతీయ జెండాను ఎగురవేశారు. అంతకు ముందు సీఎం కేసీఆర్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ నుంచి గోల్కొండకు చేరుకున్న సీఎం కేసీఆర్… ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ అంజనీ కుమార్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, కళాకారులు ఘన స్వాగతం పలికారు. అంతకుముందు సీఎం కేసీఆర్.. సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ లో సైనిక వీరుల స్మారకం వద్ద అమర జవాన్లకు నివాళులు అర్పించారు.  ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. త్వరలోనే కొత్త పీఆర్సీ నియమించి ఉద్యోగుల వేతనాలు పెంచుతామని అన్నారు. అప్పటి వరకు మధ్యంతర భతి చెల్లిస్తామని స్వయంగా ప్రకటించారు. సింగరేణి కార్మికులకు దసరా, దీపావళి బోనస్ గా వెయ్యి కోట్ల రూపాయలు పంపిణీ చేస్తామన్నారు. వచ్చే 3 నుంచి నాలుగు ఏళ్లలో మెట్రో రైల్ విస్తరణ పూర్తి చేయాలని నిర్ణయించామన్నారు.

కొత్త ప్రతిపాదనలతో హైదరాబాద్ లో 415 కిలో మీటర్ల మెట్రో సౌకర్యం రానుందన్నారు. రూ.2.51 లక్షల కోట్ల పెట్టుబడులతో రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు వచ్చాయని.. ఈ తొమ్మిదేళ్లలో పారిశ్రామిక రంగంలో 17.21 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించాయని సీఎం కేసీఆర్ వివరించారు. డతెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. బ్రిటీష్ బానిస బంధాలను ఛేదించి, దేశ విముక్తిని సాధించేందుకు తమ ప్రాణాలను తృణ ప్రాయంగా అర్పించిన స్వాతంత్ర సమర యోధులకు ఈ సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తున్నామని చెప్పారు. గతేడాది భారత స్వాతంత్ర వజ్రోత్సవాల ప్రారంభ వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకున్నామని కేసీఆర్ తెలిపారు.

CM KCR hoisted the national flag at Golconda Fort
CM KCR hoisted the national flag at Golconda Fort

ఇప్పుడు వజ్రోత్సవాల సమాపన ఘట్టాన్ని కూడా అంతే ఘనంగా నిర్వహించుకుంటున్నామన్నారు. ఈ సందర్భంగా ప్రతీ ఒక్కరి హృదయంలో దేశాభిమానం పెంపొందించే విధంగా ప్రభుత్వం పలు కార్యక్రమాలను నిర్వహిస్తోందన్నారు. రాష్ట్ర ప్రజలంతా ఈ కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నామన్నారు. 75 ఏళ్ల స్వాతంత్ర భారతం సాధించిన ప్రగతి గణనీయమైనదే అయినా.. ఆశించిన లక్ష్యాలను, చేరాల్సిన గమ్యాలను మాత్రం ఇంకా చేరలేదనే చెప్పాలని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. ప్రకృతి ప్రసాదించిన వనరులతో కష్టించి పని చేసే ప్రజలు ఉన్నప్పటికీ.. పాలకుల అసమర్థత, భావదారిద్ర్యం ఫలితంగా వనరుల సద్వినియోగం జరగడం లేదన్నారు. అన్నీ ఉండి కూడా ప్రజలు అకారణంగా అవస్థలు అనుభవిస్తున్నారని చెప్పారు. దళితులు, ఆదివాసీలు, మైనార్టీలు, బలహీన వర్గాల జీవితాల్లో అలుముకున్న పేదరికం ఇప్పటికీ తొలగిపోలేదన్నారు. వనరులను సంపూర్ణంగా వినియోగించుకొని ప్రగతి ఫలాల అన్ని వర్గాల అభ్యున్నతికి సమానంగా ఉపయోగించబడిన నాడే సాధించుకున్న స్వాతంత్ర్యానికి సార్థకత అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. అలాగే తలసరి ఆదాయం, విద్యుత్తు వినియోగంలో రాష్ట్రం నంబర్ వన్ గా ఉందని సీఎం కేసీఆర్ చెప్పుకొచ్చారు. గత నెలలో అసాధారణ స్థాయిలో భారీ వర్షాలు కురిశాయని, ప్రభుత్వం ఎప్పటికప్పుడు సహాయ చర్యలు చేపట్టింది. క్షణ చర్యలకు 500 కోట్ల రూపాయలు విడుదల చేశామన్నారు.

CM KCR hoisted the national flag at Golconda Fort
CM KCR hoisted the national flag at Golconda Fort

రైతుల సంక్షేమం వర్ధిల్లుతున్న రాష్ట్రంగా దేశానికి తెలంగాణ ఆదర్శం అన్నారు. రెండు దశల్లో దాదాపు రూ.37 వేల కోట్ల రుణమాఫీ చేశామన్నారు. రైతులకు ఈ తరహాలో రుణ విముక్తులను చేసిన చేసిన ప్రభుత్వం మరొకటి లేదన్నారు.చేనేత కార్మికుల కోం మరో కొత్త పథకం అమలుకు నిర్ణయించామన్నారు. చేనేత గుంట మగ్గాల స్థానంలో ఫ్రేమ్ మగ్గాలు అందిస్తామన్నారు. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల సస్యశ్యామలం అవుతోదంన్నారు. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టుకు పెద్ద అవరోధం తొలిగిపోయిందని అన్నారు. సత్వరమే సాగునీటి కాల్వల నిర్మాణాన్ని ప్రారంభిస్తున్నామని పేర్కొన్నారు. అతి త్వరలోనే ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారు. పాలమూరు, రంగారెడ్డి జిల్లాలు పచ్చని పైరులతో కళకళలాడుతున్నాయని.. రాష్ట్ర ప్రజలు సంపూర్ణ ఆశీర్వాదాన్ని ఇలాగే అందించాలన్నారు. రెండు దశల్లో దాదాపు రూ.37 వేల కోట్ల రుణమాఫీ చేశామన్నారు. రైతులకు ఈ తరహాలో రుణ విముక్తులను చేసిన ప్రభుత్వం మరొకటి లేదన్నారు. చేనేత కార్మికుల కోసం మరో కొత్త పథకం అమలుకు నిర్ణయించామన్నారు. చేనేత గుంట మగ్గాల స్థానంలో ఫ్రేమ్ మగ్గాలు అందిస్తామన్నారు. ప్రభుత్వానికి ప్రజల్లో ఉన్న ఆదరణ చూసి కొందరు ఆందోళన చెందుతున్నారని చెప్పుకొచ్చారు. సంకుచిత శక్తులు ఆర్టీసీ బిల్లును అడ్డుకునేందుకు విఫల ప్రయత్నాలు చేశాయి. ఆ శక్తుల ప్రయత్నాలను వమ్ము చేస్తూ.. ఆర్టీసీ బిల్లను ఆమోదించామని సీఎం కేసీఆర్ వెల్లడించారు. బిల్లు ఆమోదంతో ఆ ఉద్యోగుల కుటుంబాల్లో ఆనందం నిండిందని అన్నారు.

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!