సీఎం కెసిఆర్  ఆగస్టు 1న మహారాష్ట్ర పర్యటన

- Advertisement -
CM KCR will visit Maharashtra on August 1
CM KCR will visit Maharashtra on August 1

హైదరాబాద్ :జులై 30: ముఖ్యమంత్రి కేసీఆర్ ఆగస్టు 1వ తేదీన మహారాష్ట్రలో పర్యటించనున్నారు. ఒక రోజు పర్యటన నిమిత్తం వెళ్తున్న ఆయన సాయంత్రానికే తిరిగి హైదరాబాద్ చేరుకోనున్నారు.

మహారాష్ట్ర దళిత నేత అన్నా బావ్ సాటే జయంతి ఉత్సవాల్లో పాల్గొనే నిమిత్తం వెళ్తున్న ఆయన కొల్లాపూర్‌లోని మహాలక్ష్మి అమ్మవారిని కూడా దర్శించుకోనున్నారు.

ఆ తర్వాత సాహు మహరాష్ట్ర మనుమడిని ఆయన నివాసానికి వెళ్ళి కలవనున్నారు. దళిత నేత జయంతి ఉత్సవాల్లో కేసీఆర్‌తో పాటు మహారాష్ట్రకు చెందిన పలు పార్టీల నేతలు కూడా హాజరుకానున్నారు. రాజకీయంగా ఆ రాష్ట్రంపై ఫోకస్ పెట్టిన కేసీఆర్ అన్ని సందర్భాలనూ పొలిటికల్‌గా వాడుకుంటున్నారు.

ఇటీవల ఆ రాష్ట్రం నుంచి వివిధ పార్టీలకు చెందిన నేతలు పదుల సంఖ్యలో బీఆర్ఎస్‌లో చేరుతున్నారు.

తెలంగాణ భవన్ వేదికగా మాత్రమే కాకుండా ప్రగతి భవన్‌లోనూ పలువురు నేతలను కేసీఆర్ చేర్చుకుంటున్నారు. ఇలాంటి పొలిటికల్ పరిస్థితుల్లో మహారాష్ట్రలో దళిత నేత అన్నా బావ్ సాటే జయంతి ఉత్సవాల్లో పాల్గొని రాజకీయంగానూ అనుకూలంగా మల్చుకోనున్నారు…

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular