Thursday, January 16, 2025

ఇరిగేషన్ అధికారులతో సీఎం రేవంత్ భేటీ

- Advertisement -

ఇరిగేషన్ అధికారులతో సీఎం రేవంత్ భేటీ

CM Revanth met with irrigation officials

రాష్ట్రంపై పోలవరం ప్రాజెక్టు ప్రభావం పై నివేదిక రూపోందించాలి
హైదరాబాద్
ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి అధ్యక్షతన నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (నీటి పారుదల శాఖ) ఆదిత్యనాథ్ దాస్ తదితరులు పాల్గోన్నారు.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో తెలంగాణ పైన పడే ప్రభావంపై  ఐఐటీ హైదరాబాద్ టీం తో నివేదిక తయారు చేయించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.  నెల రోజుల్లో సమగ్ర నివేదిక తయారు చేయాలని ఆదేశించారు.  ఐఐటీ హైదరాబాద్ టీం తో కో ఆర్డినేషన్ కోసం ప్రత్యేక అధికారిని నియమించాలని సూచించారు.  పోలవరం నిర్మాణంతో  భద్రాచలం దేవాలయానికి ఏర్పడే ముప్పుపై సమగ్ర అధ్యయనం చేయాలని అన్నారు.
2022 లో 27 లక్షల క్యూసెక్ ల వరద నీరు వచ్చినప్పుడు భద్రాచలం ముంపునకు గురైనట్లు సీఎంకి అధికారులు వివరించారు.  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా చేపట్టిన గోదావరి బనకచర్ల ప్రాజెక్టు  అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. * ఈ ప్రాజె క్ట్ పైన ఇటీవల  ఏపీ ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిందని వివరణ ఇచ్చారు.  వరద జలాల ఆధారంగా నిర్మిస్తున్న ఆ ప్రాజెక్టుకు ఎలాంటి అనుమతులు లేవని సీఎంకు తెలియజేసారు అధికారులు.  ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కి తెలంగాణ అభ్యంతరాలను తెలపాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్