మహిళలకు ఉచిత ప్రయాణం – మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్​రెడ్డి

- Advertisement -

తెలంగాణవ్యాప్తంగా మహిళలకు ఆర్టీసి బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని రాష్ట్రప్రభుత్వం ప్రారంభించింది. అసెంబ్లీ ప్రాంగణంలో సీఎం రేవంత్​రెడ్డి మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించారు. జిల్లాల్లో పల్లెవెలుగు, ఎక్స్​ప్రెస్, నగరాల్లో సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ ప్రెస్ సర్వీసుల్లో మహిళలకు ఉచిత ప్రయాణి. మహిళలతో పాటు బాలికలు, విద్యార్థినులు, ట్రాన్స్‌జెండర్‌లకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే అవకాశం ఉంది. రెండు గంటల నుంచి ఉచిత బస్సు ప్రయాణం అందుబాటులోకి వచ్చింది.

మహిళలకు వయసుతో సంబంధం లేకుండా బస్సుల్లో ఉచిత ప్రయాణం సౌకర్యం అమలవుతుంది. రాష్ట్రంలో నివాసం ఉంటే మహిళలందరికీ ఈ పథకం వర్తిస్తుంది. రోజు బస్సుల్లో కిలోమీటర్ల మేర ప్రయాణించే విద్యార్థినులకు ఎక్కువస్థాయిలో ఉపశమనం లభిస్తుంది. ప్రయాణ సమయంలో స్థానికత ధ్రువీకరణ కోసం గుర్తింపు కార్డులను కండక్టర్లకు చూపించాల్సి ఉంటుంది. ఆ వెంటనే వారికి జీరో టికెట్ మంజూరు చేస్తారు. మహాలక్ష్మి పథకం ద్వారా ప్రయాణించే వారికి ప్రయాణ పరిధి విషయంలో ఎలాంటి పరిమితులుండవని అధికారులు తెలిపారు. అంతర్రాష్ట్ర సర్వీసులకు తెలంగాణ పరిధిలో మాత్రమే ఉచిత ప్రయాణం వర్తిస్తుందని వెల్లడించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular