- Advertisement -
బాధిత కుటుంబానికి అండగా సీఎం రేవంత్ రెడ్డి
డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు పత్రాలను అందజేసిన అధికారులు
హైదరాబాద్
CM Revanth Reddy Stands by the Bereaved Family
ఒకవైపు పుట్టిన బిడ్డ ఎదుగుదల సమస్యలతో బాధపడుతుండగా, మరోవైపు నివాసం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఖమ్మం జిల్లా తల్లాడ మండలం గోపాలపేటకు చెందిన రమేష్–సులోచన దంపతుల కథనంపై వెంటనే స్పందించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మానవీయతను చాటుకున్నారు.
ఒక దినపత్రికలో వెలువడిన కథనం ఆధారంగా, ఆ కుటుంబానికి తక్షణమే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించాలని జిల్లా కలెక్టర్ను ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ వెంటనే రెవెన్యూ సిబ్బందిని పంపించి, ఆ కుటుంబానికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు పత్రాలను అందజేశారు.
- Advertisement -



