Sunday, September 8, 2024

లష్కర్ గూడ గ్రామానికి సీఎం రేవంత్ రెడ్డి

- Advertisement -

జూలై 14 వ తేది ఆదివారం లష్కర్ గూడ గ్రామానికి సీఎం రేవంత్ రెడ్డి రాక
సభాస్థలి ఏర్పాట్లు పరిశీలించిన ఎమ్మెల్యే, కలెక్టర్, అధికారులు
రంగారెడ్డి

CM Revanth Reddy’s arrival at Lashkar Guda village

సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం ఇబ్రహీంపట్నం నియోజికవర్గం అబ్దుల్లాపూర్ మెట్ మండలం లష్కర్ గూడ గ్రామానికి రానున్నారు. గౌడ కులస్థులకు  భద్రతగా “కాటమయ్య రక్షణ కవచం” లను అందచేస్తారు.  తరువాత వారితో కలిసి సహంపక్తి భోజనం చేస్తారు.   తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ కార్పొరేషన్ ద్వారా కల్లు గీత కార్మికులకు భద్రత విషయంలో వారికి కాటమయ్య రక్షణ కవచం పేరుతో ఏర్పాటు చేసిన భద్రత పరికరాలను అయన పంపిణీ చేస్తారు.
ఈ సందర్భంగా సీఎం కార్యక్రమ ఏర్పాట్లను  ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే  మల్ రెడ్డి రంగారెడ్డి,  రంగారెడ్డి జిల్లా కలెక్టర్  శశాంక గారు పర్యవేక్షించారు. .నియోజికవర్గం లోని కల్లు గీత కార్మకుల సోదరుల భద్రత విషయంలో ప్రజా ప్రభుత్వం చొరవ తీసుకొని ఈ కార్యక్రమం ఏర్పాటుచేసిందని గౌడ సోదరులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే పిలుపు ఇచ్చారు..
ఈ కార్యక్రమంలో ఆర్డీఓ అనంత రెడ్డి..ఎల్బీ నగర్ డీసీపి చల్లా ప్రవీణ్ కుమార్..ట్రాఫిక్ ఏసీపీ నవీన్ రెడ్డి తో పాటు ఎక్సైజ్ అధికారులు..పోలీస్ రెవెన్యూ అధికారులు…గౌడ సంఘం పెద్దలు..కాంగ్రేస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు..

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్