సీఎంఆర్ఎఫ్ ఆర్థిక సాయం పేదల జీవితాలకు భరోసా: ఎమ్మెల్యే శిల్ప రవి రెడ్డి

- Advertisement -

నంద్యాల: సీఎంఆర్ఎఫ్ ఆర్థిక సహాయం పేద ప్రజల జీవితాలకు భరోసా కల్పిస్తున్నదని నంద్యాల శాసనసభ్యులు శిల్ప రవి రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం స్థానిక కార్యాలయంలో నంద్యాల నియోజకవర్గంలోని ముగ్గురు లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ ద్వారా మంజూరైన  3లక్షల 10వేల రూపాయల విలువైన చెక్కులను వారు అందజేశారు.

ఈ సందర్భంగా లబ్ధిదారుల తరఫున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఎమ్మెల్యే ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

CMRF's financial assistance ensures the lives of the poor: MLA Shilpa Ravi Reddy
CMRF’s financial assistance ensures the lives of the poor: MLA Shilpa Ravi Reddy

ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా పేద ప్రజల జీవితాలకు భరోసా కల్పిస్తున్నామని, అలాగే ఆరోగ్యశ్రీ పథకం కింద రాని రోగాలకు సీఎంఆర్ ద్వారా చికిత్స అందించడానికి అవకాశం కల్పిస్తున్న ముఖ్యమంత్రి కి నంద్యాల నియోజకవర్గం లబ్ధి దారుల తరుపున ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. ఇప్పటి నంద్యాల నియోజకవర్గంలో సీఎంఆర్ ద్వారా 6 కోట్ల 1లక్ష,54 వేల రూపాయలు విలువైన ఆర్థిక సహాయాన్ని పొందారని, అదేవిధంగా ఎల్ఓసీ 10లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని లబ్ధిదారులు పొందడం జరిగిందని తెలిపారు.  నంద్యాల నియోజకవర్గ స్థాయిలో ఇప్పటికి మొత్తం 6కోట్ల 14 లక్షల 64 వేల రూపాయలు సీఎంఆర్ ద్వారా లబ్ధి పొందడం జరిగిందని పేర్కొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular