- Advertisement -
ప్రతి రోజూ తడి, పొడి చెత్త వేర్వేరుగా సేకరించండీ..కమిషనర్ ఎన్.మౌర్య
Collect wet and dry garbage separately every day..Commissioner N. Maurya
తిరుపతి,
తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని గృహాల వద్ద, వాణిజ్య సముదాయాల్లోను ప్రతి రోజూ తడి, పొడి చెత్త వేర్వేరుగా సేకరించాలని కమిషనర్ మౌర్య పారిశుద్ధ్య సిబ్బందిని ఆదేశించారు. నగరపాలక సంస్థ పరిధిలోని 33 వ వార్డు స్కావెంజర్స్ కాలని, రైల్వే కాలని, తదితర ప్రాంతాల్లో కార్పొరేటర్ దూది కుమారి, హెల్త్, ఇంజినీరింగ్, ప్లానింగ్ అధికారులతో కలసి శుక్రవారం ఉదయం తనిఖీలు నిర్వహించారు. వార్డులోని ప్రజలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలోని అన్ని ప్రాంతాల్లోని గృహాలకు, వాణిజ్య సముదాయాలకు ప్రతి రోజు వాహనాలు వెళ్లి తడి, పొడి చెత్త వేర్వేరుగా సేకరించాలని అన్నారు. ప్రజలు చెత్తను ఎక్కడపడితే అక్కడ పడేయకుండా తమ సిబ్బందికి అందించాలని అన్నారు. దుకాణాల వద్ద చేత బుట్టలను పరిశీలించారు. ప్లాస్టిక్ వినియోగం తగ్గించాలని, ప్రతి ఒక్కరు చెత్త బుట్టలు వాడాలని అన్నారు. మురుగు కాలువలు మరమ్మత్తు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. స్కావెంజర్స్ కాలని వాసులకు కావాల్సిన అన్ని మౌళిక సౌకర్యాలు కల్పించాలని అన్నారు. కమిషనర్ వెంట సూపరింటెండెంట్ ఇంజినీర్ శ్యాంసుందర్, మునిసిపల్ ఇంజినీర్ తులసి కుమార్, డి.ఈ.రాజు, ఏసిపి బాలాజి, శానిటరీ సూపర్ వైజర్ చెంచయ్య, తదితరులు ఉన్నారు.
- Advertisement -