- Advertisement -
గురుకుల విద్యాలయాలను సందర్శించిన కలెక్టర్ మను చౌదరి
Collector Manu Chaudhary visited the Gurukula Vidyalayas
సిద్దిపేట
సంక్షేమ హాస్టల్లలో కొత్త డైట్ ఇంప్లిమెంటేషన్ కాస్మోటిక్ చార్జీల పెంపు ప్రారంభహోత్సవం కార్యక్రమంలో భాగంగా శనివారం జిల్లా కలెక్టర్ ఎం.మనుచౌదరి రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య తో కలిసి మిరుదొడ్డి మండలం అల్వాల్ తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాన్ని సందర్శించి గురుకుల విద్యాలయంలో పరిసరాలు, తరగతి గదులు, డార్మెంటరీ, కిచెన్ మరియు డైనింగ్ హాల్ ను సందర్శించి పరిశుభ్రతను, వంట సామాగ్రిని పరిశీలించారు. కంప్యూటర్ ల్యాబ్, లైబ్రరీని పరిశీలించి కంప్యూటర్ ల్యాబ్ ను ఉపయోగించి కంప్యూటర్ లో బేసిక్ పరిజ్ఞానంను అందించాలని, లైబ్రరీలో గొప్ప వ్యక్తుల బయోగ్రఫీబుక్స్ ను విద్యార్థులకు అందుబాటులో ఉంచాలని సూచించారు.అనంతరం కొత్త డైట్ మెనూ చార్ట్ ను ప్రారంభించారు.
ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ. గురుకులాలు, సంక్షేమ హాస్టళ్ళలో నాణ్యమైన పౌష్టికాహారం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం డైట్ చార్జీలు 40%, కాస్మోటిక్ చార్జీలు 200 % పెంచడం జరిగిందని అన్నారు. కొత్త డైట్ ప్రకారం రోజు వారిగా మెనూ రూపొందించడం జరిగిందని దీని ప్రకారం ఉదయం
స్నాక్స్, బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, సాయంత్రం స్నాక్స్, రాత్రి డిన్నర్ ను మెనూ ప్రకారం మాంసాహారంను నిర్ణిత రోజులలో పరిశుభ్రంగా వండి విద్యార్థులకు అందించడం జరుగుతుందని అన్నారు. దీని పర్యవేక్షణ కొరకు జిల్లా స్తాయి టాస్క్ ఫోర్స్ కమిటీని వేయడం జరిగిందని ఆ కమిటితో పాటు మండల ప్రత్యేక అధికారులు జిల్లా వ్యాప్తంగా పర్యవేక్షిస్తారని అన్నారు
- Advertisement -