- Advertisement -
కారంపూడిలో సీసీ రోడ్ పనులను ప్రారంభం
Commencement of CC road works in Karampudi
కారంపూడి సర్పంచ్ సరస్వతీ- బాలు నాయక్ వెల్లడి
కారంపూడి,
పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం కారంపూడి పట్టణంలోని సీ.సీ రోడ్ పనులను శనివారం గ్రామ సర్పంచ్ సరస్వతి బాలు నాయక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ, ఎన్ఆర్ఈజీఎస్ నిధుల నుండి గ్రాండ్స్ లు రావడంతో సీ.సీ రోడ్ పనులు జరుగుతున్నాయని ఆయన అన్నారు. గ్రామంలో సీ.సీ రోడ్లు లేని చోట సీ.సీ రోడ్లు వేస్తున్నామని సర్పంచ్ సరస్వతి- బాలు నాయక్ తెలిపారు. నాణ్యత గల పనులు చేస్తున్నామని వారు అన్నారు. మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మానంద రెడ్డి చొరవతో మేజర్ పంచాయతీ అయినా కారంపూడిని అభివృద్ధి బాటలో నడిపిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో నాగుల నాయక్, కటికల బాలకృష్ణ, తండా మస్తాన్ జానీ, తదితర కార్యకర్తలు పాల్గొన్నారు.
- Advertisement -