Tuesday, March 18, 2025

 ఎఫ్ టీఎల్ నిర్ధారణ కోసం కమిటీ

- Advertisement -

 ఎఫ్ టీఎల్ నిర్ధారణ కోసం కమిటీ
హైదరాబాద్, మార్చి 3, (వాయిస్ టుడే )

Committee for determination of FTL

చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూముల పరిరక్షణే లక్ష్యంగా ఏర్పడిన హైడ్రా.. అక్రమార్కుల పాలిట సింహస్వప్నంగా మారింది. అయితే.. హైడ్రాను బూచిలా చూపి.. కొంత మంది కొత్త దందాలు మొదలుపెట్టారు. ప్రస్తుతం సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ పెద్ద చెరువు ఎఫ్టీఎల్ విషయంలో అయోమయం నెలకొనగా.. దాన్నే ఆసరాగా చేసుకుని అమాయకులను మరింత భయపెట్టి అందినకాడికి దండుకుంటున్నారు. అమీన్‌పూర్ చెరువు ఎఫ్టీఎల్ స‌రిహ‌ద్దుల నిర్ధార‌ణ పేరుతో జరుగుతున్న దందాల‌పై హైడ్రా క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.పెద్ద చెరువు ముంపు బాధితుల జేఏసీ పేరుతో.. కొంతమంది దందాల‌కు పాల్పడుతున్నారని.. ర‌సీదులు, వాట్సాప్ మెస్సెజ్‌ల ఆధారాలతో సహా స్థానికుల నుంచి వచ్చిన ఫిర్యాదులను తీవ్రంగా పరిగణించిన రంగనాథ్.. సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. పెద్ద చెరువు ఎఫ్టీఎల్ నిర్ధార‌ణ‌పై హైడ్రా చేస్తున్న క‌స‌ర‌త్తును ఆస‌రాగా తీసుకుని.. ఎవ‌రైనా దందాల‌కు పాల్పడితే క‌ఠిన చ‌ర్యలు తప్పవని రంగనాథ్ వార్నింగ్ ఇచ్చారు.నీట మునిగిన లే ఔట్ ప్లాట్లను కాపాడేందుకు ఖ‌ర్చు అవుతుంద‌ని ఎవ‌రైనా దందాలు చేస్తే వారి ప‌ట్ల ప్రజ‌లు అప్రమత్తంగా ఉండాల‌ని సూచించారు. దందాల‌కు పాల్పడుతున్న వారిపై పోలీసు స్టేష‌న్‌లో ఫిర్యాదు చేయాల‌ని బాధితుల‌కు హైడ్రా కమిషనర్ రంగనాథ్ సూచించారు. అలాంటి వారిపై హైడ్రా నుంచి కూడా కేసులు పెట్టాల‌ని అధికారుల‌ను రంగనాథ్ ఆదేశించారు. అమీన్‌పూర్ చెరువులో నీట మునిగిన ప్లాట్ల య‌జ‌మానులు ఎవ‌రినీ ఆశ్రయించాల్సిన ప‌ని లేద‌ని రంగనాథ్ స్పష్టం చేశారు.దాదాపు 95 ఎక‌రాలుండే చెరువు.. 450 ఎక‌రాల‌కు ఎలా విస్తరించింద‌నే విష‌య‌ంపై హైడ్రా లోతైన విశ్లేష‌ణ చేస్తోంద‌ని రంగనాథ్ తెలిపారు. ఈ విష‌యం ప్రభుత్వం దృష్టిలో కూడా ఉంద‌ని పేర్కొన్నారు. గ్రామ రికార్డులు, స‌ర్వే ఆఫ్ ఇండియా, నేష‌న‌ల్ రిమోట్ సెన్సింగ్ సెంట‌ర్ ఇమేజీల‌తో స‌రిపోల్చడ‌మే కాకుండా సంబంధిత‌ శాఖ‌ల అధికారుల‌తో స‌మీక్షించి ఎఫ్టీఎల్ నిర్ధారించనున్నట్టు రంగనాథ్ తెలిపారు.అమీన్‌పూర్ చెరువులో నీట మునిగిన ప్లాట్ల య‌జ‌మానులు ఎవ‌రినీ ఆశ్ర‌యించాల్సిన ప‌ని లేద‌ని ఈ సంద‌ర్భంగా క‌మిష‌న‌ర్ స్ప‌ష్టం చేశారు. దాదాపు 95 ఎక‌రాలుండే చెరువు 450 ఎక‌రాల‌కు ఎలా విస్త‌రించింద‌నే విష‌య‌మై హైడ్రా లోతైన విశ్లేష‌ణ చేస్తోంద‌ని… ఈ విష‌యం ప్ర‌భుత్వం దృష్టిలో కూడా ఉంద‌న్నారు. గ్రామ రికార్డులు, స‌ర్వే ఆఫ్ ఇండియా, నేష‌న‌ల్ రిమోట్ సెన్సింగ్ సెంట‌ర్ ఇమేజీల‌తో స‌రిపోల్చ‌డ‌మే కాకుండా సంబంధిత‌ శాఖ‌ల అధికారుల‌తో స‌మీక్షించి ఎఫ్‌టీఎల్ నిర్ధార‌ణ పూర్తి చేస్తామ‌ని క‌మిష‌న‌ర్ చెప్పారు.జేఎన్‌టీయూ, ఐఐటీ క‌ళాశాల‌ల‌కు చెందిన వారి భాగ‌స్వామ్యంతో ఒక క‌మిటీని వేసి ఎఫ్‌టీఎల్ నిర్ధార‌ణ జ‌రుగుతుంద‌న్నారు. రెండు, మూడు నెలల్లోనే ఈ ప్ర‌క్రియ పూర్తి అవుతుంద‌న్నారు. నిష్ప‌క్ష‌పాతంగా… ఎక్క‌డా ఎలాంటి పొర‌పాట్ల‌కు ఆస్కారం లేకుండా అమీన్‌పూర్ చెరువు ఎఫ్‌టీఎల్‌( ఫుల్ ట్యాంక్ లెవెల్‌) నిర్ధార‌ణ జ‌రుగుతుంద‌ని.. అప్ప‌టి వ‌ర‌కూ ఓపిక ప‌ట్టాల‌ని సూచించారు.నీట మునిగిన లే ఔట్ల ప్లాట్ల‌ను కాపాడేందుకు ఖ‌ర్చు అవుతుంద‌ని ఎవ‌రైనా దందాలు చేస్తే వారి ప‌ట్ల ప్ర‌జ‌లు అప్ర‌మత్తంగా ఉండాల‌న్నారు. అమీన్‌పూర్ పెద్ద చెరువు ముంపు బాధితుల – జేఏసీలో స‌భ్యులు కావాలంటే రూ. వేయి చెల్లించాల‌ని.. త‌ర్వాత గ‌జానికి రూ. 500లు చొప్పున చెల్లిస్తే ప్ర‌భుత్వ శాఖ‌ల‌లో స‌ర్దుబాట్లు చేయాల్సి ఉంటుంద‌ని చెబుతూ వ‌సూళ్ల‌కు పాల్ప‌డుతున్నార‌ని ప‌లువురు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. అమీన్‌పూర్ పెద్ద చెరువు ముంపు బాధితుల – జేఏసీ ఛైర్మెన్ గా ప‌రిచ‌యం చేసుకుంటూ.. ఏకంగా ఒక ర‌సీదు పుస్త‌కాన్ని ప్ర‌చురించి.. చిరునామా(నండూరి) స‌త్య‌నారాయ‌ణ ఈ దందాల‌కు పాల్ప‌డుతున్నార‌ని బాధితులు వాపోయారు.జేఎన్‌టీయూ, ఐఐటీ కాలేజీల‌కు చెందిన వారి భాగ‌స్వామ్యంతో ఒక క‌మిటీని వేసి ఎఫ్టీఎల్ నిర్ధార‌ణ జ‌రుగుతుంద‌ని రంగనాథ్ తెలిపారు. రెండు, మూడు నెలల్లోనే ఈ ప్రక్రియ పూర్తవుతుంద‌ని చెప్పుకొచ్చారు. నిష్పక్షపాతంగా ఎక్కడా ఎలాంటి పొర‌పాట్లకు ఆస్కారం లేకుండా అమీన్‌పూర్ చెరువు ఎఫ్టీఎల్‌ నిర్ధార‌ణ జ‌రుగుతుంద‌ని.. అప్పటి వ‌ర‌కూ ఓపిక ప‌ట్టాల‌ని స్థానికులకు రంగనాథ్ సూచించారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్