పోషకాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం

- Advertisement -

పోషకాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం

Complete health with nutrition

జగిత్యాల సిడిపిఓ మమత
జగిత్యాల,

సరైన పోషకాహారం తీసుకోవడం ద్వారా గర్భవతులు, బాలింతలు, పిల్లలు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని జగిత్యాల సిడిపిఓ మమత అన్నారు. పోషణ మాసం సందర్భంగా శుక్రవారం పలు అంగన్వాడీ కేంద్రాలలో పోషకాహార ప్రదర్శన, ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని నిర్వహించారు.
పట్టణంలోని గాంధీనగర్ అర్బన్ హెల్త్ సెంటర్, గణేష్ నగర్ అంగన్వాడీ కేంద్రాలలో సిడిపిఓ మమత ఆధ్వర్యంలో పోషకాహార ప్రదర్శన ఏర్పాటు చేసి తల్లులకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో గర్భవతులు, బాలింతలు,తల్లులు, పిల్లలు తీసుకోవాల్సిన ఆహారాన్ని ప్రత్యక్షంగా ప్రదర్శించారు.  ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు,  బాలామృతము ప్లస్, కోడిగుడ్ల ప్రాముఖ్యతను వివరించారు.రోజువారి ఆహారంలో ఆకుకూరలు, కూరగాయలు,పాలు, పండ్లు, బాలమృతం, బాలామృతం ప్లస్సు, ఉడికించిన గుడ్డు తప్పనిసరిగా అందరూ తీసుకోవాలని కోరారు. పిల్లల పెరుగుదల పర్యవేక్షణ గూర్చి తల్లులకు అవగాహన కలిగించారు. పరిసరాల పరిశుభ్రత, దోమల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.కాచి చల్లార్చిన నీరు త్రాగాలని తల్లులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో బేటి బచావో బేటి పడావో స్కీమ్స్, ఆడపిల్లలు, మహిళల రక్షణ,సఖి 181 గూర్చి, మహిళ సాధికారిక సిబ్బంది తల్లులకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో జెండర్ స్పెషలిస్టు గౌతమి, స్వప్న,హేమశ్రీ అంగన్వాడీ టీచర్స్ కే. అరుణ, పి.అరుణ ఆశా వర్కర్, గర్భవతులు, బాలింతలు, పిల్లలు, తల్లులు పాల్గొన్నారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular