శారీరక దృఢత్వం మానసిక వికాసం కొరకు వీక్లీ పోలీస్ పెరేడ్ డ్రిల్ల్ నిర్వహణ….
Conducting weekly police parade drill for physical fitness and mental developmentనంద్యాల
జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా ఆదేశాలమేరకు నంద్యాల పట్టణంలోని జిల్లా పోలీస్ కార్యాలయం ఎదురుగా గల మైదానం నందు నంద్యాల సబ్ డివిజన్ పోలీస్ అధికారులు మరియు వారి సిబ్బందితో వీక్లీ పోలీస్ పెరేడ్ డ్రిల్ల్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా పోలీసు అధికారులు మాట్లాడుతూ ప్రతి శుక్రవారం ఈ వీక్లీ పోలీస్ పెరేడ్ డ్రిల్ల్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తప్పనిసరిగా సాయుధ బలగాల సిబ్బంది సివిల్ పోలీసులు అందరూ హాజరుకావాలని తెలియజేశారు.
పెరేడ్ డ్రిల్ చేయడం ద్వారా శారీరక దృఢత్వంతో పాటు మానసిక వికాసం కలుగుతుంది.
ప్రతి శుక్రవారం పోలీస్ డ్రిల్ మాత్రమే కాకుండా యోగ ఫిజికల్ ట్రైనింగ్ మొదలగునవి నిర్వహించడం జరుగుతుంది.
వివిధ రకాల పోలీస్ డ్యూటీలలో ఉన్న అందరూ ఒకే చోట కలవడం ద్వారా సమస్యలు అధికారులకు తెలియజేయడం మరియు ఈ పెరేడ్ డ్రిల్ కార్యక్రమం ఒక రీఫ్రెష్ కోర్సులా సిబ్బందికి ఉపయోగపడుతుందని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఏఆర్ అడిషనల్ ఎస్పీ చంద్రబాబు, నంద్యాల సబ్ డివిజన్ డి.ఎస్.పి శ్రీనివాసరెడ్డి, AR డి.ఎస్.పి శ్రీనివాసులు, సాయుధ బలగాల సిబ్బంది, సివిల్ పోలీసులు పాల్గొన్నారు.




