Sunday, September 8, 2024

అభివాదంచేసిన పవన్ భార్య

- Advertisement -

అభివాదంచేసిన పవన్ భార్య
హైదరాబాద్, జూన్ 4
: ఏపీ ఎన్నికల్లో కూటమి విజయం సాధిస్తుంది. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాయి. ఇన్నేళ్ల నిరీక్షణకు ఫలితంగా జనసేన పోటీ చేసిన అన్ని స్థానాల్లో లీడింగ్ తో దూసుకెళ్తుంది. జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా పిఠాపురంలో భారీ మెజారిటీతో గెలిచారు. దీంతో పవన్ అభిమానులు, జనసేన కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు హైదరాబాద్ లోని పవన్ నివాసం బయట అభిమానులు, కార్యకర్తలకు వచ్చి సెలబ్రేషన్స్ చేస్తుండటంతో పవన్ భార్య అన్నా లేజనోవా, తనయుడు అకిరా నందన్ బయటకు వచ్చి అభిమానులకు అభివాదం చేశారు. పవన్ కళ్యాణ్ ని గెలిపించినందుకు ధన్యవాదాలు తెలిపారు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది.
పవన్ క్లీన్ స్వీప్
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ప్రభంజనం సృష్టిస్తోంది. కూటమి అభ్యర్ధులు విజయ దుందభి మోగిస్తున్నారు. పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన జనసేన అభ్యర్ధి పవన్ కల్యాణ్ ఘన విజయం సాధించారు. తన సమీప వైసీపీ అభ్యర్ధి వంగా గీతపై 69,169 ఓట్ల మెజార్టీతో పవన్ విజయం సాధించారు. గత ఎన్నికల్లో రెండు నియోజకవర్గాల్లో పోటీచేసి ఓడిపోయిన పవన్ కల్యాణ్.. ప్రస్తుత ఎన్నికల్లో ఘన విజయం సాధిచండంతో జనసైనికుల సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. పవన్ కల్యాణ్ విజయంతో సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.మరోవైపు కూటమిలో భాగంగా జనసేన పోటీ చేసిన 21 నియోజకవర్గాల్లో అన్ని స్థానాల్లో  ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించే అవకాశాలున్నాయి

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్