Friday, March 6, 2026

కాంగ్రెస్, బీఆర్ఎస్ లు రెండు జూటా పార్టీలే

- Advertisement -

పట్టభద్రులకు అన్యాయం చేసింది ఒకరు – ప్రజలని మోసం చేసింది మరొకరు

ఆడబిడ్డగా మీ ముందుకు వచ్చిన… ఆశీర్వదించండి.

బీజేపీ జగిత్యాల అభ్యర్థి డాక్టర్ భోగ శ్రావణి

జగిత్యాల: తెలంగాణ రాష్ట్రం లో కాంగ్రెస్, బీఆర్ఎస్ లు రెండు జూటా పార్టీలేనని బిజెపి జగిత్యాల అభ్యర్థి డాక్టర్ భోగ శ్రావణి -ప్రవీణ్ అన్నారు.మంగళవారం జగిత్యాల రూరల్ మండలం మోరపల్లి, చల్ గల్ గ్రామాల్లో బిజెపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గడప గడపకు వెళ్లి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా భోగ శ్రావణి  మాట్లాడుతూ ప్రజలకు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు చేస్తున్న మోసలను వివరించేందుకే మీ దగ్గరికి వచ్చానన్నారు. సరిగ్గా ఓట్ల టైం దగ్గర పడుతున్న సమయంలో జూటా పార్టీలకు కాకుండా, మీ కోసం పనిచేసే వారికి, మీ సంక్షేమం, అభివృద్ధి ఆకాంక్షిచే పార్టీకి ఓటు వెయ్యాలని కోరారు. నలభై ఏళ్లుగా రాజకీయం చేస్తున్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అనేక పదవులు అనుభవించిన, ప్రస్తుతం ఎమ్మెల్సీ పదవికాలం ఉన్న పోటీ చేస్తున్న ఆయనకు తగిన గుణపాఠం చెప్పాలని కోరారు. కేవలం వడ్ల కుప్పల పై

 

కూర్చొని మాట్లాడ్డం కాదన్నారు. పట్టభద్రుల గురించి ఏనాడూ సభలో మాట్లాడలేదని, ఒక్క ధర్నా నిర్వహించలేదన్నారు. అలాగే బీఆర్ఎస్ పార్టీ కూడా తక్కువేం కాదని ప్రజలను మభ్యపెడుతూ మోసం

 

చేస్తుందన్నారు. దళిత, బిసి బంధు, డబుల్ బెడ్ రూం ఇల్లు, వడ్డీ లేని రుణాలు, తరుగు పేరుతో దోపిడీకి  పాల్పడుతున్నా పట్టించుకోలేదని ఆరోపించారు. బుటకపు హామీలు, అబద్దాలతో మరోసారి

 

అవకాశం కోసం వస్తున్నారని ప్రజలు ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. రెండు ప్రభుత్వాల పనితీరు ప్రజలు గమనించాలని  కోరారు. బీజేపీ అభ్యర్థిగా తనను గెలిపిస్తే ఐకేపి సెంటర్ ల అభివృద్ధి చేయడంతో

 

పాటుగా, ధాన్యం కొనుగోళ్లలో తరుగు లేకుండా చూస్తానని హామీ ఇచ్చారు. అంతకు ముందు బిజెపి జిల్లా అధ్యక్షులు మోరపల్లి సత్యనారాయణ రావు, రైతు నాయకులు పన్నాల తిరుపతి రెడ్డి  కేంద్ర

 

ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాలను వివరించారు. బిజెపి అభ్యర్థి కి ఓటు వేసి గెలిపించారు. ఈ కార్యక్రమం లో రూరల్ మండల అధ్యక్షులు నలవాల తిరుపతి, జిల్లా చేనేత కన్వీనర్ కొక్కుల

 

గణేష్, ఓబిసి మోర్చా జిల్లా అధ్యక్షులు కొక్కు గంగాధర్, జిల్లా కోశాధికారి సుంకేట దశరథ్ రెడ్డి, అర్బన్ మండల ఇన్చార్జ్ జున్ను రాజేందర్, మండల ఉపాధ్యక్షులు ముంజాల శేఖర్ గౌడ్, తాటిపల్లి ఎంపీటీసీ

 

పూదరి శ్రీనివాస్, బూత్ అధ్యక్షులు బొమ్మ కంటి గంగాధర్, మల్లన్న శేఖర్, శక్తి కేంద్రం ఇంచార్జ్ రాజిరెడ్డి, జనసేన కార్యకర్తలు, నాయకులు, యువకులు ,మహిళలు పెద్ద ఎత్తున, పాల్గొన్నారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్