కాంగ్రెస్ వస్తె కంట్రోల్ ఢిల్లీ నుండి ఉంటుంది

- Advertisement -

కాంగ్రెస్ పై మంత్రి హరీశ్ రావు

Congress control will be from Delhi
Congress control will be from Delhi

రంగారెడ్డి:  కర్ణాటక సీఎం సిద్దారామయ్య, డిప్యూటీ సీఎం డికె శివకుమార్ వచ్చి ఇక్కడ ప్రచారం చేస్తున్నారు. ఏమి చూసి ఓటు వేయాలి. మీ వద్ద రోజూ ఆత్మహత్యలు జరిగితే ఏం ముఖం పెట్టుకొని ఓటు అడుగుతున్నారని మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. బాచూపల్లిలో కే ఎల్ యునివర్సిటీ కార్యక్రమం అనంతరం మీడియాతో మంత్రి మాట్లాడారు.  ఐదు  గంటల కరెంట్ ఇస్తున్నాం అని మొన్న డికె శివకుమార్ ఒప్పుకున్నారు. మీ ఇల్లు సక్కగా లేదు, ఇక్కడకు వచ్చి నీతులు చెబుతున్నారు. టికెట్లు కావాలంటే ఢిల్లీ, డబ్బులు కర్ణాటక, ప్రచరంకు ఇతర రాష్ట్రాల నుండి నాయకులు రావాలి. కాంగ్రెస్ వస్తె కంట్రోల్ ఢిల్లీ నుండి ఉంటుంది. కర్ణాటక నుండి ఉంటుంది. కృష్ణా జలాలు, ఐటి వివాదాలు వస్తె మన హక్కులను కాంగ్రెస్ పార్టీ కాపాడుతుందా. మొత్తం కర్ణాటక దిక్కరించి రాష్ర్టాల ప్రయోజనాలు కాపాడుతారా.. బ్రిజేష్ ట్రిబ్యునల్ పంచాయి ఉంది. ఎటు వైపు ఉంటారు. వారిని ఎదిరించే దమ్ము ధర్యం కాంగ్రెస్ కు ఉందా. కాళ్ళు మొక్కేవాల్లు, అడుగులకు మడుగులు ఒత్తే వాళ్ళు తెలంగాణ ప్రయోజనం కాపాదుతరా. తెలంగాణ రక్షణ కేసీఆర్ వల్లే సాధ్యం అవుతుందని అన్నారు.

Congress control will be from Delhi
Congress control will be from Delhi
- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular