Sunday, September 8, 2024

తెలంగాణ లో రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వమే !

- Advertisement -

ఎమ్మెల్సీ తాత మధు వ్యాఖ్యలు అర్థరహితం !

టిపిసిసి సభ్యులు బుడగం శ్రీనివాస్

భద్రాచలం, అక్టోబర్ 13 ( వాయిస్ టు డే ) బడ్జెట్లో ప్రకటించిన 17,700 కోట్లు  దళిత బంధు నిధులు విడుదల చేయకుండా,దొంగ లిస్టులతో దళిత బంధు లబ్ధిదారులను మోసం చేసిన బిఆర్ఎస్ నాయకులు ,పార్టీ కండువా కప్పుకొని, జండా పట్టుకున్న నాయకులకే పథకాలు అని చెప్తే నాయకులకు ఓటు హక్కుతో ప్రజలు బుద్ధి చెప్పాలని పిసిసి సభ్యులు బుడగం శ్రీనివాసరావు పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే  క్యాంప్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పథకాలను పూర్తిగా అమలు చేయలేని బిఆర్ఎస్ నాయకులు ఓటు ఆడిగే నైతిక హక్కు లేదు అన్నారు.ఎలక్షన్ కోడ్ వస్తుందని ముందే  చెప్పిన మేధావి  కేటీఆర్,ఎలక్షన్ కోడ్ కన్నా ముందే పథకాలను ఎందుకు అమలు చేయలేదు అని ప్రశ్నించారు.దళితులను మోసం చేసి ఓట్లు దండుకోవటం కోసం దొంగలిస్టులు ఇచ్చి బిఆర్ఎస్ నాయకులను జనాల్లోకి పంపారు.

దళిత బంధు,మైనార్టీ బందు, గృహలక్ష్మి, బీసీ బందు పథకాలను రాష్ట్రంలో పూర్తిస్థాయిలో అమలు చేయలేని అసమర్థులు బిఆర్ఎస్ నాయకులు. పార్టీ కండవ కప్పుకొని, జండా పట్టుకున్న వారికే పథకాలు అని ఎమ్మెల్సీ తాతా మధు అన్న మాటలు నిన్న వైరల్ అయ్యాయి, ఆ వీడియో ఇప్పటిది కాదు అని ఆయన ఇచ్చిన వివరణ విడ్డూరంగా ఉంది. వీడియో ఎప్పటికీ అయితే మాత్రం అధికారులు నీ తొత్తులు అని మాట్లాడే అర్హత నీకు ఎవరిచ్చారు, నీ పార్టీ కండువా కప్పుకునే వాళ్ళకి ప్రభుత్వ పథకాలని మాట్లాడి నీచ రాజకీయాలు చేసే మిమ్మల్ని ప్రజలు తరిమికొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని వారిని హెచ్చరించారు. ఈ విషయంపై పార్టీ పెద్దలతో మాట్లాడి చర్చించి,ఎలక్షన్ ఫిర్యాదు చేస్తామని అన్నారు. మొన్న కేటీఆర్ భద్రాచల పర్యటన షెడ్యూల్లో కనీసం రామయ్య దర్శనానికి టైం కేటాయించకపోవడం దౌర్భాగ్యమైన విషయం.పదేళ్లు మంత్రిగా ఉన్న కేటీఆర్ భద్రాచలానికి ఒక్కసారైనా వచ్చాడా,ఎన్నికలు వచ్చేసరికి భద్రాచలం ప్రజలు ఓట్లు దండుకునేందుకు అవ్వని పనులకు శంకుస్థాపలు చెయ్యాలని చూస్తే రాములవారు ఆగ్రహిస్తే శంకుస్థాపన ఆగిన పరిస్థితి.తెలంగాణ ఏర్పాటుకు ముందు మంత్రి హరీష్ రావు  నేతృత్వంలో ఒక టీం ఇక్కడికి వచ్చి తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలి జిల్లాగా భద్రాచలం అనే ప్రకటిస్తామని చెప్పి పదేళ్లపాటు హరీష్ రావు కనపడకుండా పోయాడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటినుండి భద్రాచలం ప్రాంతానికి ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం అన్యాయం చేస్తూనే ఉంది అన్నారు.ఆ అన్యాయాన్ని ఎదిరిస్తూనే శాసనసభ్యులు పొదెం వీరయ్య అనేకమార్లు శాసనసభ వేదికగా ప్రభుత్వాన్ని నిలదీశారు. అయినా కూడా ఏరోజు భద్రాచలం ప్రజల కష్టాలను తీర్చడానికి గాని,అభివృద్ధి చేయడానికి గాని ఒక్క పైసా కూడా ఇవ్వని ఈ బిఆర్ఎస్ ప్రభుత్వం, ఈరోజు కొత్తగా బిఆర్ఎస్  అభ్యర్థిని గెలిపిస్తే భద్రాచలాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పటం సిగ్గుచేటని అన్నారు. ఆంధ్రాలో కలిసిన ఐదు పంచాయతీలను కలిపి భద్రాచలాన్ని అభివృద్ధి చేయమని అడిగితే, మిగిలి ఉన్న భద్రాచలన్నీ మూడు పంచాయతీలుగా విభజిస్తూ జీవో తీసుకొచ్చిన మీరు భద్రాచల అభివృద్ధికి కట్టుబడి ఉన్నారని చెప్పటం దయ్యాలు వేదాలు వల్లించినట్టే ఉంది అని అన్నారు.. ఎందుకు వెయ్యాలి బిఆర్ఎస్ పార్టీకి ఓట్లు 17,700 కోట్లు దళిత బంధు నిధులు విడుదల చేయనందుకా….?

దొంగ లిస్టులతో ప్రజల్లోకి వచ్చే బీఆర్ఎస్ నాయకులను ప్రజలు తరిమికొట్టాలి అని ప్రజలకు సూచించారు. భద్రాచలం నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొదెం వీరయ్య  25వేల మెజారిటీతో గెలవడం ఖాయం అని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సరేళ్ళ నరేష్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు భోగాల శ్రీనివాసరెడ్డి, బంధం శ్రీనివాస్ గౌడ్, ఎన్ ఎస్ యు ఐ నియోజకవర్గం అధ్యక్షులు సరెళ్ళ వెంకటేష్, పట్టణ ఎస్సీ సెల్ అధ్యక్షులు రసమల రాము,ధారా తరుణ్ మిత్ర,సేలం రామ్మోహన్ రెడ్డి, మహిళా కాంగ్రెస్ నాయకులు వసంతాల రాజేశ్వరి,పందాల సరిత,తుమ్మల రాణి, కుమారి,వసీమ,హసీనా, గౌరీ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్