బీసీలను వెన్నుపోటు పొడిచిన కాంగ్రెస్

- Advertisement -

బీసీలను వెన్నుపోటు పొడిచిన కాంగ్రెస్

Congress has turned its back on the BCs

హైదరాబాద్
కాంగ్రెసు పార్టీ బీసీ డిక్లరేషన్ పేరుతో బలహీన వర్గాలకు బలమైన వెన్నుపోటు పొడిచిందని బీఆర్ఎస్వి నాయకులు అన్నారు.
సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా నేడు ఇందిరాపార్క్  వద్ద ఎమ్మెల్సీ  కవిత ఆధ్వర్యంలో  జరిగే బీసీమహా సభకు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బిఆర్ఎస్వి నాయకుడు మధు ఆధ్వర్యంలో విద్యార్థులు భారీగా తరలి వెళ్లారు. ఈ సందర్భంగా విద్యార్థి నేతలు మాట్లాడుతూ  బీసీ కులాలు కుల సంఘాల నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.  కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీల మాదిరిగా మళ్లీ తెలంగాణ బీసీలను కూడా మోసం చేయకుండా అందరం అప్రమత్తంగా ఉండాలన్నారు.
స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ను కాంగ్రెస్ నాయకులు ప్రకటించారని, అధికారం వచ్చిన ఆరు నెలల లోపే బీసీ కుల గణన అని చెప్పి కేవలం అసెంబ్లీ తీర్మానంతోనే సరిపెట్టరాన్నారు. కామారెడ్డి డిక్లరేషన్ మేరకు రిజర్వేషన్లు పెంచిన తర్వాతే ప్రభుత్వం ఎన్నికలకు నిర్వహించడం పై ఆలోచన చేయాలని లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular