Sunday, September 8, 2024

భూములకు…సాగు నీటికి సిస్తు వసూలు చేసిన ఘనత కాంగ్రెస్ దే

- Advertisement -

24 గం. కరంటు…నీల్చిచ్చిన రైతు బాంధవుడు సీఎం కేసీఆర్‌

బీఆర్ఎస్ జగిత్యాల ఎమ్మెల్యే అభ్యర్థి డా. సంజయ్‌ కుమార్‌

జగిత్యాల: కాంగ్రెస్ పాలనలో రైతుల నుంచి భూ సిస్తూ,  నీటి పన్ను వసూలు చేశారని తెలంగాణ పాలనలో 24 గంటల కరెంట్ సాగునీటిని ఇచ్చిన రైతు బాంధవుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ అన్నారు. బుధవారం జగిత్యాల రూరల్‌ మండలంలోని తాటిపెల్లి, మోరపెల్లి, చల్‌గల్‌, చర్లపెల్లి, హస్నాబాద్‌ గ్రామాల్లో జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్‌ కుమార్ కార్నర్‌ మీటింగ్‌లు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం రాకంటె ముందు హైద్రాబాద్‌ మినహా రాష్ట్రంలోని అన్ని జిల్లాలు వెనుకబడిన జిల్లాలుగా కేంద్రప్రభుత్వం ప్రకటించిందని, అటువంటి పరిస్థితి నుండి నేడు తెలంగాణ రాష్ట్రం దేశానికి అన్నంపెట్టే రాష్ట్రంగా ఎదగడానికి కారణం సీఎం కేసీఆర్‌ చలవే అన్నారు. వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరంటు సరఫరా, చెరువులకు పూర్వవైభవం తీసుకురావడంతో భూగర్భ జలమట్టం పెరుగడం, ప్రాజెక్టుల ద్వారా నీటి సరఫరా చేయడంతో తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో నేడు భూమికి బరువయ్యేలా పంటలు పండుతున్నాయన్నారు. వరి కోతల సమయం కావడంతో ఎక్కడ చూసినా ధాన్యపు రాశులే కనపడుతున్నాయన్నారు. తాటిపెల్లి వద్ద ఎస్సారెస్పీ కాలువకు మోటర్లు పెట్టుకొని పంటలకు నీరు పెట్టుకుంటుంటే అధికారులు కరంటు కట్‌ చేశారని, కరంటు పునరుద్దరించాలంటూ మీతో పాటు నేను కూడా రోడ్డుపై బైఠాయించానని, విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెల్లడంతో రైతులు రాష్ట్రంలోని ఏ కాలువకు మోటర్లు పెట్టుకున్నా కరంటు కట్‌ చేయవద్దని సీఎం కేసీఆర్‌ ఆదేశాలు జారీ చేశారన్నారు. గతంలో కాంగ్రెస్, బీజేపీల పాలనను చూసిండ్రు…వాల్ల పాలనలో వ్యవసాయానికి కరంటు ఎట్టించ్చిండ్రో కూడా చూసిండ్రు…ఎన్ని కష్టాలు పడ్డరో గుర్తుంచుకోవాలని, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్‌ వ్యవసాయానికి కరంటు ఎట్లిస్తున్నరనే విషయాన్ని పరిశీలించాలన్నారు.

24 గంటల కరంటుతో రాత్రి పూట పంట పొలాల కాడికి పోవాల్సిన పరిస్థితిని సీఎం కేసీఆర్‌ తప్పించాడని, దీంతో రైతులు రాత్రి సమయాల్లో కుటుంబంతో కలిసి గడుపుతున్నారని, కరంటు పోతుందనే రంది లేకుండా పొద్దుననే పనిచేసుకుంటున్నరు…వీలైతే వేరే పనులకు సైతం వెలుతున్నారని,  వ్యవసాయానికి 3గంటల కరంటు సరిపోతుందని, 10 హెచ్‌పీ మోటార్లు పెట్టుకోవాలని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారని, మూడు గంటల కరంటు సరిపోతుందా….10హెచ్‌పీ మోటర్లు రైతులకు భారం కాదా అని ఆలోచించాలని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మల్లీ కరంటు కష్టాలు తప్పవన్నారు. భూములకు తహసీల్‌ వసూలు చేసి, సాగు నీటికి శిస్తులు గుంజి సర్కారు నుండి పైసా సాయం చేయిన కాంగ్రెస్ పార్టీ నేడు ఆడబిడ్డల వివాహాలకు తులం బంగారం ఇస్తామని ప్రచారాలు చేస్తున్నారని, వాల్లు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకియ్యలేదని, కేవలం అధికారం కైవసం చేసుకోవడానికి మాత్రమే దొంగ హామీలు ఇస్తున్నారని, వారి మాయలో పడొద్దన్నారు. రూ. 200 ఉన్న ఆసరా పెన్షన్‌ను తొలుత వెయ్యికి, ఆ తర్వాత రూ. 2వేలకు పెంచామని, త్వరలోనే రూ. 5వేలకు పెంచుతామని, దివ్యాంగులకు కూడా రూ. 6వేలు చేస్తామని, సౌభాగ్య లక్ష్మీ పథకం ద్వారా రేషన్‌ కార్డు ఉన్న ప్రతి మహిళకు రూ. 3వేల పెన్షన్‌ను, భూమిలేని నిరుపేదలకు రైతు బీమా తరహాలోనే రూ. 5లక్షల ఉచిత బీమాను అందిస్తామని, రేషన్‌ ద్వారా సన్నబియ్యం అందిస్తామని, రూ. 400 కే గ్యాస్ సిలిండర్‌ను అందిస్తామన్నారు. హామీలన్నీ అమలు చేసిన తర్వాతనే మల్లీ ఓట్లు అడుగుతామన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రాష్ట్రంలో దళితులను ఆర్థికంగా వృద్దిలోకి తీసుకురావాలనే ఉద్దేశ్యంతో ఆడబిడ్డల పెండ్లిలకు కళ్యాణ లక్ష్మీ పథకాన్ని ప్రారంభించి తొలుత రూ. 50 వేలు, ఆ తర్వాత రూ.75 వేలు, ఇప్పుడు లక్ష రూపాయలు అందిస్తున్నామని, అ తర్వాత కళ్యాణలక్ష్మీ పథకాన్ని బీసీలకు, అగ్రవర్ణపేదలకు సైతం అమలుపర్చామన్నారు. 50 యూనిట్లు ఉచిత కరంటు ఉండగా, దీనిని 100 యూనిట్లకు పెంచామని, దళితులను మరింత అభివృద్ది చేసేందుకు దళిత బందు పథకాన్ని అమలుపర్చామన్నారు. మంచినీల్ల బావి నుండి చల్‌గల్‌ వరకు గల జాతీయ రహదారిని నాలుగు లైన్ల రహదారిని సైతం నేషనల్‌ హైవే అథారిటీ అధికారులతో మాట్లాడి నాలుగు లైన్ల నిర్మాణానికి నిధులు తెచ్చామని, రోడ్డు పనులు సైతం ప్రారంభయయ్యాయన్నారు.

రానున్న కాలంలో అర్హులైన ప్రతి దళితు కుటుంబానికి దళితబంధు అమలు చేస్తామన్నారు.  జగిత్యాల నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని అభివృద్ది చేశామని, రోడ్లు వేశామన్నారు. అన్ని వర్గాల అభివృద్దికి కృషి చేశానన్నారు. జగిత్యాల నుండి కిష్టంపేట వరకు రోడ్డు బాకీ పడిందని, మల్లీ గెలిపిస్తే కిష్టంపేట రోడ్డును సైతం వేయిస్తానన్నారు. కార్నర్‌ మీటింగ్‌కు వచ్చిన ఎమ్మెల్యే డా. సంజయ్‌ కుమార్‌కు గ్రామ మహిళలు, గ్రామస్థులు మంగళహారుతులు, డప్పు చప్పుల్లతో ఘన స్వాగతం పలికారు.ఈ కార్యక్రమం లో మండల, గ్రామ నాయకులు,మహిళలు,యువకులు,రైతులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్