Thursday, March 20, 2025

కాంగ్రెస్ జోరు…  కారు బేజారు

- Advertisement -

కాంగ్రెస్ జోరు…  కారు బేజారు
హైదరాబాద్, మార్చి 15,
కల్వకుంట్ల చంద్రశేఖరరావు.. తెలంగాణ యాస, బాస పేర ప్రత్యర్థులపై ఉచితానుచితాలు పట్టించుకోకుండా విమర్శల పేరిట దూషణలతో విరుచుకు పడిపోయే వారు. ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమ సారథ్య బాధ్యతలు చేపట్టారో అప్పటి నుంచీ కేసీఆర్ ది అదే శైలి. ఇక రాష్ట్ర విభజన తరువాత 2014 ఎన్నికలలో విజయం సాధించి తెలంగాణ ముఖ్యమంత్రిగా పగ్గాలు అందుకున్న తరువాత నుంచి రేవంత్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు.  కేసీఆర్ భాషలోనే విమర్శలు గుప్పించడానికి ఇసుమంతైనా వెనుకాడటం లేదు. ఇప్పటి వరకూ ప్రత్యర్థులు నోరెత్తకుండా తనకే ప్రత్యేకమైన భాష, యాసలో విరుచుకుపడి ఎదురే లేదన్నట్లుగా వ్యవహరించిన కేసీఆర్ నే డిఫెన్స్ లో పడేసేంత స్థాయిలో రేవంత్ రెడ్డి దూకుడు పెంచారు.  గతంలో ఈ పరిస్థితి ఉండేది కాదు. తెలంగాణ ఉద్యమ సమయంలో  ఆ ఉద్యమ సారథిగా కేసీఆర్ తన ఫస్ట్ టార్గెట్ గా తెలుగుదేశం పార్టీని ఎంచుకున్నారు. రెండు రాష్ట్రాలకూ న్యాయం అన్న చంద్రబాబు మాటలను కాయిన్ చేసి రెండు కళ్ల సిద్ధాంతం అంటూ తనదైన భాషలో చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. అయితే చంద్రబాబు మాత్రం ఎన్నడూ రాజకీయ మర్యాదలకు తిలోదకాలిచ్చి మాట్లాడింది లేదు. ఆయన ఎప్పుడూ పరిధి దాటరు. తీవ్ర ఆగ్రహం వస్తే ఏం తమాషా చేస్తున్నారా అన్నది మాత్రమే ఆయన నోటి వెంట వచ్చే మాట. ఉద్యమ ఊపులో అప్పట్లో  కేసీఆర్ భాషకు, యాసకు తెలంగాణ జనం నుంచి మంచి స్పందన వచ్చింది. అదే సమయంలో చంద్రబాబు శైలి ప్రస్తుత రాజకీయాలకు సరిపడదనీ, ఆయనది ఔట్ డేటెడ్ స్టైల్ అనీ అప్పట్లో సొంత పార్టీ వారే అన్న సందర్భాలు ఉన్నాయి. అయినా చంద్రబాబు తన స్టైల్ మార్చుకోలేదు. అదే ఆయన బలం అని ఆ తరువాత పలు సందర్భాలలో రుజువైంది అది వేరే సంగతి.ఇక వైఎస్ రాజశేఖరరెడ్డి అకాల మరణం తరువాత ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రులుగా ఉన్న కొణిజేటి రోశయ్య కానీ,  ఆ తరువాత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కానీ, కేసీఆర్ వాగ్దాటి ముందు నిలువలేకపోయారు. సరే రాష్ట్ర విభజన తరువాత కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు. కాంగ్రెస్ సారథ్య బాధ్యతలు చేపట్టిన పొన్నాల లక్ష్మయ్య, ఆయన తరువాత ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా కేసీఆర్ విమర్శల జడిలో తడిసి ముద్దయ్యారు. దీటుగా బదులివ్వడంలో విఫలమయ్యారు. కానీ రేవంత్ కాంగ్రెస్ రాష్ట్ర పగ్గాలు చేపట్టిన తరవాత పరిస్థితి పూర్తిగా మారింది. కేసీఆర్ కు దీటుగా ఆయన భాషలోనే బదులివ్వడం ద్వారా రేవంత్ పార్టీ శ్రేణుల్లో కూడా జోష్ నింపగలిగారు. సరే ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో  బీఆర్ఎస్ పరాజయం పాలైంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. రేవంత్ ముఖ్యమంత్రి అయ్యారు. పదేళ్ల పాటు ఇష్టారాజ్యంగా వ్యవహరించిన బీఆర్ఎస్ సర్కార్ తప్పిదాలు ఒక్కటొక్కటిగా బయటకు వస్తున్నాయి. వాటి ఆధారంగా కేసీఆర్ లక్ష్యంగా రేవంత్ తన విమర్శలకు పదునుపెట్టడంతో కేసీఆర్ పూర్తిగా డిఫెన్స్ లో పడిపోయారు.  గతంలో తన ధోరణి,  ప్రత్యర్థి పార్టీల నేతలపై ఉపయోగించిన భాష అన్ని కన్వీనియెంట్ గా మరచిపోయి.. కరీంనగర్ సభలో ఒక మాజీ ముఖ్యమంత్రిని ఉద్దేశించి మాట్లాడాల్సిన భాషేనా అది అంటూ అమాయకంగా ప్రశ్నించారు. రేవంత్ కనీస మర్యాద కూడా లేకుండా వ్యవహరిస్తున్నారనీ, తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎన్నడైనా ఇటువంటి అనుచిత భాష ఏపయోగించానా అంటూ వ్యాఖ్యలు చేశారు. వెంటనే కాంగ్రెస్ అలర్ట్ అయి గతంలో కేసీఆర్ అనుచిత భాషా ప్రయోగంతో చేసిన ప్రసంగాల వీడియోలను సామాజిక మాధ్యమంలో విస్తృతంగా ప్రచారంలోకి తీసుకు వచ్చింది. అవి వెంటనే వైరల్ అయిపోతున్నాయి. దీంతో కేసీఆర్ అనివార్యంగా మౌనం వహించాల్సివచ్చింది. మొత్తం మీద కేసీఆర్ భాషనే ఆయనమీద ప్రయోగించి రేవంత్ పై చేయి సాధించారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్