కర్నాటక సీఎంను మార్చేందుకు కాంగ్రెస్‌ కసరత్తు

- Advertisement -

కర్నాటక సీఎంను మార్చేందుకు కాంగ్రెస్‌ కసరత్తు
పార్టీ హైకమాండ్‌ నిర్ణయానికి తమంత కట్టుబడి ఉంటాం
సీఎం సిద్ధరామయ్య.. సీఎం రేసులో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌
న్యూ డిల్లీ జూలై 1
కర్నాటక సీఎంను మార్చాలని కాంగ్రెస్‌ హైకమాండ్‌ యోచిస్తోందనే వార్తలు గుప్పుమంటున్నాయి. సీఎం రేసులో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ పేరు వినిపిస్తుండటంతో ముఖ్యమంత్రి మార్పు అంశం మరోసారి తెరపైకి వచ్చింది. నాయకత్వ మార్పు విషయంపై కర్నాటక కాంగ్రెస్‌లో జోరుగా ఊహాగానాలు సాగుతున్నాయి.సిద్ధరామయ్యను పక్కకుపెట్టి డీకే శివకుమార్‌కు పాలనా పగ్గాలు అప్పగిస్తారని హైకమాండ్‌ సైతం ఈ దిశగా కసరత్తు సాగిస్తున్నదని కాంగ్రెస్‌ వర్గాల్లో హాట్‌ డిబేట్‌ సాగుతోంది. సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ల సమక్షంలో ఇటీవల ఓ స్వామీజీ డీకేను సీఎం పీఠంపై కూర్చోబెట్టాలని వ్యాఖ్యానించడం కలకలం రేపింది. ఇక సీఎం మార్పు వార్తలపై సిద్ధరామయ్యను సోమవారం మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.ఈ విషయం ప్రజల మధ్య చర్చించాల్సిన వ్యవహారం కాదని పేర్కొన్నారు. పార్టీ హైకమాండ్‌ తీసుకునే నిర్ణయానికి తామంతా కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. సీఎం మార్పు వ్యవహారంపై సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలు నాయకత్వ మార్పు ఊహాగానాలు మరింత జోరుగా సాగేలా చేశాయని భావిస్తున్నారు. సీఎంను మార్చుతారనే వ్యాఖ్యలను ఆయన ఖండించకపోవడంపై హాట్‌డిబేట్‌ సాగుతోంది. దీంతో సీఎం సిద్ధరామయ్యపై వేటు తప్పదా అని కాంగ్రెస్‌ వర్గాల్లో చర్చ జోరందుకుంది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular