100 కోట్లతో జర్నలిస్టుల సంక్షేమ నిధి ఏర్పాటు
జగిత్యాల కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి
జగిత్యాల: ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తున్న జర్నలిస్టులకు అండగా ఉండి,వారి సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే పెద్ద పీట వేస్తుందని పట్టభద్రుల ఎమ్మెల్సీ, జగిత్యాల అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తాటిపర్తి జీవన్ రెడ్డి అన్నారు. శనివారం జగిత్యాలలో జీవన్ రెడ్డి మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా వార్త సేకరణ చేశారని,అలాగె అవినీతి, అక్రమాలను వెలికితిస్తూ ప్రభుత్వాలకు, ప్రజలకు అనుసంధానంగా పనిచేస్తున్న వారి సేవలు వెలకట్టలేనివని కొనియాడారు.
కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో జర్నలిస్టుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇచ్చామని చెప్పారు.
100 కోట్లతో జర్నలిస్టుల సంక్షేమనిధిని ఏర్పాటు చేస్తామని సుదీర్ఘ కాలంగా పెండింగులో ఉన్న హైదరాబాద్ ఇళ్ల స్థలాల సమస్యను పరిష్కరిస్తామన్నారు.
అర్హులైన ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులకు జిల్లాల వారిగా ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని, మృతి చెందిన జర్నలిస్ట్ కుటుంబాలకు రూ.5 లక్షల నగదు అందజేస్తామన్నారు.
రిటైర్డ్ ఆయిన జర్నలిస్టుల కు పెన్షన్ సదుపాయం, జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ ను జర్నలిస్ట్ కుటుంబ సభ్యులకు మెరుగైన వైద్యం అందేలా హెల్త్ కార్డులు జారీ తదితర సంక్షేమ కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అందిస్తామని జీవన్ రెడ్డి తెలిపారు.
జర్నలిస్టులకు అండగా కాంగ్రెస్ మేనిఫెస్టో
జగిత్యాల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కిషన్ రెడ్డి
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో జర్నలిస్టులకు, వారి కుటుంబాలను అదుకునేవిధంగా ఉందని జగిత్యాల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎన్నం కిషన్ రెడ్డి అన్నారు. గతంలో ఏ రాజకీయ పార్టీ జర్నలిస్టుల సంక్షేమాన్ని పట్టిoచుకోలేదని తెలిపారు. జగిత్యాల లో శనివారం కిషన్ రెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమాన్ని కాంక్షించి కాంగ్రెసు పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టదాన్ని అభినందిస్తున్నానని చెప్పారు. ఇళ్ల స్థలాలు, హెల్త్ కార్డులు, సంక్షేమ నిధి ఏర్పాటు, పెన్షన్ సౌకర్యం, మృతి చెందిన కుటుంబాలకు 5 లక్షలు అందజేయడం వంటి స్కీములు జర్నలిస్టులకు అండగా ఉంటాయని పేర్కొన్నారు.
జర్నలిస్టులపై దాడులు జరుగుతున్నాయని దాన్ని దృష్టిలో పెట్టుకుని కాంగ్రెసు పార్టీ అధికారంలోకి రాగానే జర్నలిస్టుల రక్షణ చట్టం తీసుకురావాలని అందుకు జీవన్ రెడ్డి కృషి చేయాలని కోరారు.
కాంగ్రెస్ పార్టీ జర్నలిస్టుల సంక్షేమాన్ని కాంక్షించడం పట్ల కిషన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
మేనిఫెస్టో రూపకల్పన చేసిన రేవంత్ రెడ్డి, జీవన్ రెడ్డి, శ్రీధర్ బాబులను జె కిషన్ రెడ్డి అభినందించారు.