10 ఏళ్లలో మూడింతలైన యూపీ బడ్జెట్

- Advertisement -

10 ఏళ్లలో మూడింతలైన యూపీ బడ్జెట్
లక్నో, ఫిబ్రవరి 16, (న్యూస్ పల్స్)

UP budget tripled in 10 years
యోగి ఆదిత్యనాథ్‌.. పరిచయం అక్కరలేని పేరు. కరుడుగట్టిన హిందుత్వవాది. కుహానా లౌకికవాదులకు మొగుడు. దేశభక్తులు, మహిళా పక్షపాతి. కామాధులపైకి బుల్జోడర్లు నడిపిన ముఖ్యమంత్రి. సంచల నిర్ణయాలతో ఉత్తరప్రదేశ్‌లో వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చింది యోగి ప్రభుత్వం. ఈ క్రమంలో మరో రికార్డు సృష్టించింది. రాష్ట్ర చరిత్రలో అరుదైన రికార్డు నెలకొన్పింది.యూపీలో యోగి ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చింది. ఈ ఏడాదితో పదేళ్లు పూర్తి చేసుకుంటుంది. అయితే ఆర్థిక మంత్రులు మారినా.. యోగి ప్రభుత్వంమే 2017–18 నుంచి 2026–27 వరకు వరుసగా 10 ఆర్థిక బడ్జెట్లు ప్రవేశపెట్టడం ద్వారా ఏకైక రికార్డు సృష్టించింది.చివరి బీజేపీ యేతర బడ్జెట్‌  రూ.3.4 లక్షల కోట్లు. అప్పటి ఆర్థిక మంత్రి అఖిలేష్‌ యాదవ్‌ ప్రవేశపెట్టారు. ఇక ప్రస్తుతం యోగి పాలనలో 2026–27కి రూ.9.13 లక్షల కోట్లు సుమారు మూడు రెట్లు పెరుగింది. ఆర్థిక స్థిరత్వం, పెట్టుబడుల ద్వారా ఈ ఎదుగుదల సాధ్యమైంది.ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, గ్రామీణ ఉపాధి, రవాణా, ఆసుపత్రులు, రోడ్ల అభివృద్ధికి అధిక నిధులు. రోడ్లు, ఎక్స్‌ప్రెస్‌వేలు, పారిశ్రామిక ప్రాంతాలు, ఆరోగ్య సౌకర్యాలు మెరుగుపడ్డాయి.అఖిలేష్‌ యాదవ్‌ పాలన తర్వాత యోగి ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసింది. పెరిగిన బడ్జెట్‌లు రాష్ట్రాన్ని దేశ ఆర్థిక శక్తిగా మార్చాయి. ఉపాధి, మౌలిక సదుపాయాలపై దష్టి దీర్ఘకాల ప్రయోజనాలు ఇస్తాయి. ఈ రికార్డు పాలనా స్థిరత్వానికి, ప్రణాళికా బద్ధతకు చిహ్నం.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular