- Advertisement -
ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని విమర్శించే స్థాయి కాంగ్రెస్ నాయకులకు లేదు
Congress leaders do not have the level to criticize MLA Peddi Sudarshan Reddy
నర్సంపేట
అవగాహన లేని ప్రకటనలతో ప్రజల్లో అసత్యాలు మాట్లాడకుండా ప్రజాక్షేత్రంలోకి రావాలని బిఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శి వేణుముద్దుల శ్రీధర్ రెడ్డి అన్నారు.బుధవారం పంపిచ్చిన ప్రకటనలో శ్రీధర్ మాట్లాడుతూ,పట్టణంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కబ్జాలు ,కాంట్రాక్ట్లు, కమిషన్లు,వాటాలు,వసూళ్లు చేస్తూ అరాచకాలు సృష్టిస్తున్నారని విమర్శించాడు.ఫిర్యాదుల కోసం అక్రమ కేసుల కోసం పోలీస్ స్టేషన్లలో కాపలాకాస్తున్నది ఎవరో ప్రజలకు తెలుసని అన్నారు. నర్సంపేటను అభివృద్ధి చేసింది ఎవరో,ప్రస్తుతం విధ్వంసం చేస్తున్నది ఎవరో ప్రజలు చూస్తున్నారన్నారు.పెద్ది సుదర్శన్ రెడ్డి చేసిన నియోజకవర్గ అభివృద్ధి కళ్ళకు కనపడుటలేదా, అంటూ విమర్శలు చేశాడు.100 రోజుల్లో గ్యారెంటీలన్నీ అమలు చేస్తామని చెప్పి 400 రోజులైనా అమలు చేయకపోతే ప్రజల పక్షాన ప్రతిపక్షంగా మాట్లాడటం ప్రజాస్వామిక హక్కు అన్నాడు.నర్సంపేట నియోజకవర్గాన్ని చరిత్రలో లేని విదంగా అభివృద్ధిని చేసి చూపించిన నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నాడు.నర్సంపేటలో ఎవరు ఊహించని విధంగా మెడికల్ కళాశాల, నర్సింగ్ కళాశాల, జిల్లా హాస్పిటల్ , డయాగ్నిస్టిక్ సెంటర్, డయాలసిస్ సెంటర్, బ్లడ్ బ్యాంక్ పాకాల,రంగయ్య చెరువుకు గోదావరి జలాలు, చెక్ డ్యాములు, బ్రిడ్జిలు రోడ్ లు,హార్టికల్చర్ రీసెర్చ్ సెంటర్, సైనిక్ స్కూల్,ఆడిటోరియం, డివైడర్లు సెంట్రల్ లైటింగ్, వెజిటబుల్ మార్కెట్, సబ్ స్టేషన్లు, వ్యవసాయ సబ్సిడీ యంత్రాలు ,రైతులకు పంట నష్ట పరిహారం, అత్యధిక గురుకుల పాఠశాలను కళాశాలలు ఇలా విద్య వైద్యం,వ్యవసాయం, తాగు,సాగు నీటిలో నర్సంపేట నియోజకవర్గన్ని అభివృద్ధి చేసి చూపించారని తెలిపాడు.గ్రూపులుగా,వర్గాలుగా ఏర్పడి పేదప్రజలను ,చిన్నా పెద్దా వ్యాపార వర్గాలను వేధిస్తూ, అక్రమ కేసులు బనాయిస్తూ సెటిల్మెంట్లకు పాల్పడుతున్నవారికి రాబోయే రోజుల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని అన్నాడు.
- Advertisement -