*సొంత గూటికి కాంగ్రెస్ నేతలు*
*తొర్రూర్ ఏప్రిల్ 02 వాయిస్ టూడే*
పాలకుర్తి ఎమ్మెల్యే యశేశ్విని రెడ్డి & పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి అనుమాండ్ల ఝాన్సీ రెడ్డి ఆహ్వానం మేరకు కాంగ్రెస్ పార్టీ మండల ముఖ్య నాయకులు నిరంజన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ మేకల కుమార్ ఆధ్వర్యంలో హైదరాబాద్ గాంధీభవన్ లో BRS పార్టీ నుండి మన మాజీ గ్రామ సర్పంచ్ వల్లపు శోభ యాకయ్య మరియు BRS పార్టీ ముఖ్య నాయకులు పెద్ద ఎత్తున సొంత గూడు ఐనా కాంగ్రెస్ పార్టీలోకి చేరడం జరిగింది.
పాలకుర్తి ఎమ్మెల్యే యశేశ్విని రెడ్డి & పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి అనుమాండ్ల ఝాన్సీ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు.