Monday, March 16, 2026

కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే..

- Advertisement -

కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే..

Congress means government..

రైతు ప్రభుత్వం..

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉన్నాం…

*
పెద్దపల్లి ఎమ్మెల్యే  చింతకుంట విజయరమణ రావు

పెద్దపల్లి జి
జూలపల్లి మండలం పెద్దాపూర్, తేలుకుంట, నాగులపల్లి, చీమలపేట గ్రామాలలో అలాగే ఎలిగేడు మండల కేంద్రంలో సింగిల్ విండో మరియు ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాలను మార్కెట్ కమిటీ చైర్మన్, సింగిల్ విండో చైర్మన్, స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే  చింతకుంట విజయరమణ రావు ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..

కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతు ప్రభుత్వమని ఆరుగాలం కష్టపడి తన రెక్కల కష్టంతో ఎందరో ఆకలి తీర్చే అన్నదాతకు అన్యాయం జరవద్దని అన్నారు. రైతును కష్టపెట్టిన ఎ ప్రభుత్వం ఎక్కువ కాలం నిలబడలేదని గత పాలకుల చేతిలో రైతన్నలు చాలా నష్టపోయారని తెలిపారు. గతంలో మాదిరిగా రైతన్నలను ఇబ్బందులకు గురిచేస్తే ఎవ్వరినీ ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. రైతులు పండించిన పంట విషయంలో ఎలాంటి కోతలు విదించకూడదని కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు ఎమ్మెల్యే విజయరమణ రావు గారు ఆదేశించారు. ఒకవేళ ధాన్యం కోతలు చేస్తున్నారని మా దృష్టికి వస్తే 24 గంటలకు గడవకముందే వారి బాధ్యతల నుండి తొలగించి నూతనంగా ఇతరులను చేర్చడం జరుతుందని హెచ్చరించారు. ఈ విషయంలో ఎవరి మాటా వినబోమని స్పష్టం చేశారు. రైతులు తమకు ఎలాంటి ఇబ్బందులూ వచ్చిన వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. అలాగే ఈ సీజన్ నుండే సన్న రకం పంటకు రూ. 500 బోనస్ అందించడం జరుగుతుందని అన్నారు. రైతు తన ధాన్యం అమ్మకం జరిపిన వెంటనే రెండు లేదా మూడు రోజుల్లోనే తమ పంట డబ్బులను రైతు ఖాతాలలోని జమ చేయడానికి ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటుందని ఈ సందర్భంగా తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో జూలపల్లి వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గండు సంజీవ్ మరియు సింగిల్ విండో చైర్మన్లు పుల్లూరి వేణుగోపాల్ రావు గారు,గోపు విజయ్ భాస్కర రెడ్డి గారు,MRO ,ఏపీఎం, ఎంపివిఒ మరియు ఎలిగేడు మండల అధ్యక్షులు సమా రాజేశ్వర్ రెడ్డి గారు , సంతోష్ రావు,జూలపల్లి మండల అధ్యక్షులు బొజ్జ శ్రీనివాస్ గారు మరియు మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, సింగిల్ విండో డైరెక్టర్లు మరియు మాజీ సర్పంచ్ లు,ఎంపీటీసీ లు మరియు రైతులు, హామాలీలు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్