11.1 C
New York
Wednesday, February 28, 2024

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి రావడం ఖాయం దుద్దిల్ల శ్రీధర్ బాబు

- Advertisement -

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి రావడం ఖాయం

-కాంగ్రెస్ మ్యానిఫెస్టో తో రైతులు,యువకులు, మహిళలు, నిరుపేదలకు లబ్ధి

-ఏఐసీసీ సెక్రెటరీ, తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టో చైర్మన్,

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి రావడం ఖాయం కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి దుద్దిల్ల శ్రీధర్ బాబు

మంథని

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి రావడం ఖాయమని, కాంగ్రెస్ మ్యానిఫెస్టో తో రైతులు,యువకులు, మహిళలు, నిరుపేదలకు లబ్ధి చేకూరనున్నదని ఏఐసీసీ సెక్రెటరీ, తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ చైర్మన్, కాంగ్రెస్ మంథని ఎమ్మెల్యే అభ్యర్థి దుద్దిల్ల  శ్రీధర్ బాబు అన్నారు.
మంథని మండలం ఖానాపూర్ గ్రామంలో మాజీ ఎంపీపీ నారమల్ల లక్ష్మీరాజం తో పాటు వందమందికి పైగా కాంగ్రెస్ పార్టీలో చేరారు.
వీరికి శ్రీధర్ బాబు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా దుద్దిల్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీ పథకాలు ఎంతో భరోసా నిస్తున్నాయన్నారు.
తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ రుణం తీర్చుకునే సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. రైతు భరోసా పథకం కింద 15 వేల రూపాయలు, కౌలు రైతుకు 12 వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు. గృహ జ్యోతి పథకం కింద 200 యూనిట్ల ఉచిత విద్య సరఫరా చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు.
ఇందిరమ్మ ఇంటి పథకం నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుందని,
ప్రతి మహిళకు ప్రతినెల మహాలక్ష్మి పథకం  2500 రూపాయలు,మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ,500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందజేయడం జరుగుతుందని అన్నారు. కెసిఆర్ పాలన పై ప్రజలకు విరక్తి కలిగిందని స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో తెలంగాణలో ప్రజలకు మంచి రోజులు రానున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో మంథని  మండల కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఉన్నారు

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!