బిసిలకు అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ
బి.సిలకు 42 శాతం విద్య ఉద్యోగ రాజకీయాల్లో అమలు చేయాలి
రామగుండం మాజీ ఎమ్మెల్యే బి.ఆర్.ఎస్ పార్టీ అధ్యక్షుడు కోరుకంటి చందర్
Congress party has done injustice to BCs
గోదావరి ఖని
తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన బిసిలను అనుగదోక్కేందుకే కులగణన పేరుతో సర్వే చేపట్టిందని, ఈ సర్వేలో 5న్నరశాతం బిసిల జనాభా ను తగ్గించి 22 లక్షల మంది లెనట్టుగా చేసింది రెవంత్ రెడ్డి ప్రభుత్వమని కులగణన అంతా తప్పుల తడకని తెలంగాణ రాష్ట్రంలొని బిసిలకు న్యాయం జరిగేదాకా పోరాడుతామని రామగుండం మాజీ ఎమ్మెల్యే బి.ఆర్.ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ అన్నారు. శుక్రవారం గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అధ్యక్షతన బిసి కుల సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కాంగ్రెస్ పరిపాలనలో బిసిలకు అన్యాయం జరిగిందన్నారు. బి.ఆర్.ఎస్ ప్రభుత్వం కేసీఆర్ బిసిలకు ఉన్నతంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో పని చేశారన్నారు. బిసి బంధు పధకం ద్వారా అర్దిక భరోసా కల్పించారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కుల గణన పై బిసిలను వ్యతికేత రావడంతో ప్రభుత్వం మళ్లి కుల గణన చేపట్టనుందన్నారు. బి.సిలకు 42 శాతం విద్య ఉద్యోగ రాజకీయాల్లో అమలు చేయాలని బి.సి వర్గాలకు బ్యాంకు లోన్లు సబ్సిడీ లు అధాయపన్ను మినహాయింపు చేయాలని, ఓ బి సి మంత్రిత్వశాఖ శాఖను కేంద్రం ప్రభుత్వం ఒక ప్రత్యేక శాఖ ఎర్పాటు చేయాలని, = కార్యనిర్వాహక న్యాయ శాఖల్లో రిజర్వేషన్లు అమలు చేయాలని, రాజ్యాంగ సవరణ చేసి 50 శాతం నిబంధన ఎత్తివేయాలని బిసి సంఘాల రౌండ్ టెబుల్ సమావేశం తీర్మాణం చేశారు. ఈ సమావేశం లో కుమ్మరి సంఘం నాయకులు ఇజ్జగిరి భూమయ్య మేదరి సంఘం నాయకులు రెడ్డి భాస్కర్ రజక సంఘం కనకరాజు ముదిరాజ్ సంఘం నాయకులు సదానందం ప్రశాంత్ ముదిరాజ్ పద్మశాలి సంఘం నాయకులు గుడెల్లి రాంచెందర్ అరే కటిక కిరన్ జీ క్రిస్టియన్ నాయకులు దివాకర్ గౌడ సంఘం నాయకులు మహేందర్ కుర్మ సంఘం నాయకులు సారన్న కోమురయ్య నాయు బ్రాహ్మణ సంఘం నాయకులు మందల వెంకటేష్ పోశం పెరుక సంఘం నాయకులు దండె మల్లేష్ విశ్వబ్రాహ్మణ సంఘ నాయకులు ఎలేశ్వరం వెంకటేష్ రాజన్నల సంఘ నాయకులు జక్కుల తిరుపతి గాండ్ల సంఘ నాయకులు ఉమాశంకర్ తో పాటు నాయకులు గోపు అయులయ్య యాదవ్ రాజయ్య బోడ్దుపల్లి శ్రీనివాస్ అచ్చే వేణు నూతి తిరుపతి నారాయణదాసు మారుతి పిల్లి రమేష్ సట్టు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు…