పేదల గుండెల్లో నిలిచిన పార్టీ కాంగ్రెస్ పార్టీ
కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి జువ్వాడి నర్సింగరావు
కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
కోరుట్ల
పేద బడుగు బలహీన వర్గాల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని కాంగ్రెస్ పార్టీ కోరుట్ల నియోజకవర్గ ఇంచార్జి జువ్వాడి నర్సింగరావు ఆన్నారు.. గురువారం
కాంగ్రెస్ పార్టీ 139 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి..ఈ సందర్భంగా కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ
నర్సింగరావు పార్టీ కార్యాలయం వద్ద
కాంగ్రెస్ పార్టీ జెండా ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ స్వాతంత్రం కోసం పోరాడింది కాంగ్రెస్ పార్టీ అని దేశం నిర్మాణానికి కృషి చేసింది కాంగ్రెస్ పార్టీ అని తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని ఈరోజు తెలంగాణను పునర్ నిర్మించాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీపై ఉందన్నారు.. కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త ప్రజా సంక్షేమానికి కృషి చేయాలని ప్రభుత్వం ప్రవేశపెట్టే కార్యక్రమాలను ప్రజల వద్దకు చేరేలా కార్యకర్తలు వారధిలా పని చేయాలని అన్నారు.. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు, పట్టణ శాఖ అధ్యక్షులు తిరుమల గంగాధర్, వార్డు కౌన్సిలర్ తిరుమల- వసంత, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కొంతం రాజం,
బిసి సెల్ జిల్లా అధ్యక్షులు వెంకటేష్ గౌడ్,నాయకులు మ్యాకల నర్సయ్య ,దండవేని వెంకట్, ఎంబేరి సత్యనారాయణ, యూత్ కాంగ్రెస్ నియోజక వర్గ అధ్యక్షులు ఏలేటి మహిపాల్ రెడ్డి, జిల్లా మైనారిటీ ఉపాధ్యక్షులు వసీం, నాయకులు పేట భాస్కర్, సురేష్, అశోక్ తదితరులు పాల్గొన్నారు..