ప్రత్యక్ష ఎన్నికలకు దూరమవుతున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్లు
న్యూఢిల్లీ మార్చ్ 12
కాంగ్రెస్ పార్టీ సీనియర్లు ఒక్కొక్కరిగా ప్రత్యక్ష ఎన్నికలకు దూరమవుతున్నారు. ఇప్పటికే పార్టీ అధినేత మల్లికార్జునఖర్గే లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేయొద్దని నిర్ణయించుకున్నట్లు తెలుస్తున్నది. ఆయన దారిలోనే మాజీ ముఖ్యమంత్రులు, పార్టీ సీనియర్లు దిగ్విజయ్ సింగ్, అశోక్ గెహ్లాట్, హరీశ్ రావత్, కమల్‌నాథ్, రాజస్థాన్ మాజీ ఉపముఖ్యమంత్రి సచిన్ పైలట్ కూడా పయనిస్తున్నారు. సోమవారం జరిగిన పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ (CEC) రెండో మీటింగ్‌లో 62 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులపై చర్చజరిగినట్లు తెలుస్తున్నది. ఇందులో గుజరాత్‌లో 14 సీట్లు, రాజస్థాన్ 13, మధ్యప్రదేశ్ 16, అస్సాం 14, ఉత్తరాఖండ్‌లో 5 స్థానాల చొప్పున ఉన్నాయి. ఈ సందర్భంగా ఆయా రాష్ట్రాల మాజీ ముఖ్యమంత్రులు, సీనియర్ నేతలను పరిగణనలోకి తీసుకోనట్లు సమాచారం.రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లాట్ స్థానంలో తన కుమారుడు వైభవ్ గెహ్లాట్‌ను జాలోర్ స్థానం నుంచి పోటీకీ సీఈసీ ఓకే చెప్పినట్లు తెలుస్తున్నది. అదేవిధంగా గెహ్లాట్ సొంత సీటైన జోధ్‌పూర్‌పై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇక మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్‌నాథ్ కుమారుడు, ఛింద్వారా ఎంపీ నకుల్ నాథ్ తిరిగి అదే స్థానం నుంచి పోటీచేయనున్నారు. కాగా, అనారోగ్య కారణాలతో ఉత్తరాఖండ్ సీఎం హరీశ్ రావత్ లోక్‌సభ ఎన్నికలకు దూరంగా ఉంటానని ఇప్పటికే ప్రకటించారు. తనకు బదులుగా కుమారుడు వీరెందర్ రావత్‌కు హరిద్వార్ టికెట్ కేటాయించాలని పార్టీ అధిష్ఠానాన్ని కోరారు.రాజస్థాన్ మాజీ ఉపముఖ్యమంత్రి సచిన్ పైలట్ కూడా సార్వత్రిక ఎన్నికల్లో పోటీకి విముఖంగా ఉన్నారు. రాష్ట్రంలోని నాలుగు స్థానాల్లో పార్టీని గెలిపించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. అదేవిధంగా తాను ఇన్‌చార్జిగా ఉన్న ఛత్తీస్‌గఢ్‌లో విస్తృతంగా పర్యటించడానికి అవకాశం ఉంటుందని ఆయన ఇప్పటికే ప్రకటించారు.
ప్రత్యక్ష ఎన్నికలకు దూరమవుతున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్లు
- Advertisement -
- Advertisement -