మహేశ్వరంలో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయం: కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి
సరూర్‌నగర్ లో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభం
ఎల్బీనగర్, వాయిస్ టుడే:
మహేశ్వరం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయడం ఖాయమని మహేశ్వరం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి అన్నారు. మహేశ్వరం నియోజకవర్గం సరూర్‌నగర్ డివిజన్ లో నూతనంగా ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశానికి హాజరయ్యారు. సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 200 యూనిట్ల వరకు కరెంటు, రాష్ట్రంలో ఎక్కడికైనా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన భూములను పక్కా రిజిస్ట్రేషన్ చేయిస్తామని అన్నారు. నేతల అవినీతిని బయటకు తీస్తామని, తిరిగి అవినీతి జరుగకుండా చూస్తానని అన్నారు. గెలిచాక అన్ని సమస్యలు పరిష్కరిస్తామని హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దేప భాస్కర్ రెడ్డి, నాయకులు ఆకుల అరవింద్ కుమార్, బండ మధుసూదన్ రావు, నల్లంకి ధన్ రాజ్ గౌడ్, అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.



