Sunday, October 6, 2024

మరో 9 మంది కోసం గేట్లు ఓపెన్

- Advertisement -

మిషన్ 80 గా కాంగ్రెస్ అడుగులు...
మరో 9 మంది కోసం గేట్లు ఓపెన్
హైదరాబాద్, జూలై 6,
తెలంగాణ కాంగ్రెస్ ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. 80 టార్గెట్ గా పెట్టుకుని వీలైనంత త్వరగా టార్గెట్ ఫినిష్ చేయాలని హస్తం నేతలు కసరత్తు చేస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల ముందు కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్య కనీసం 80కి చేరాలని డిసైడ్ అయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో 64 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలుపొందగా, కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ అభ్యర్థి గెలుపొందారు. దీంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్యా బలం 65 కి పెరిగింది. ఇక బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు విడతల వారీగా కాంగ్రెస్ గూటికి చేరారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే వెంకటేశ్వర్లు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్యలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దీంతో కాంగ్రెస్ సంఖ్యా బలం 71 కి చేరింది.ఇక ఈ రెండు మూడు రోజుల్లోనే మరిన్ని చేరికలు ఉంటాయని హస్తం నేతలు చెబుతున్నారు. ఆషాడం మొదలవక ముందే కాంగ్రెస్‌లోకి వచ్చేందుకు పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం. గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిలోని ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తో టచ్ లో ఉన్నట్లు, ముగ్గురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో చ‌ర్చలు పూర్తయ్యాయ‌ట. రెండు మూడు రోజుల్లోనే వారు తమ గూటికి వస్తారని హస్తం నేతలు చెబుతున్నారు. ఉమ్మడి మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాలోని ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో ఒకరు కాంగ్రెస్‌లో చేరేందుకు ఒకే చెప్పినట్లు సమాచారం. ఇక మాజీ సీఎం కేసీఆర్ స్వంత జిల్లా మెద‌క్‌కు చెందిన న‌లుగురు ఎమ్మెల్యేలు సైతం కాంగ్రెస్‌లో చేరేందుకు రెడీగా ఉన్నార‌ట‌. క‌రీంన‌గ‌ర్ జిల్లాకు చెందిన ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్‌లో చేరేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. గులాబీ పార్టీలోని చాలామంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ ట‌చ్‌లోకి రావడంతో ఏకంగా బీఆర్ఎస్‌ఎల్పీని కాంగ్రెస్‌లో విలీనం చేయాలని కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తోంది.మొన్నటి వరకు ఎవరిని చేర్చుకుంటే ఏం అవుతుందో అని భయపడ్డ రేవంత్, హై కమాండ్ గ్రీన్ సిగ్నల్‌తో తన దూకుడు పెంచారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు బీజేపీ గాలం వేస్తోందని అప్రమత్తంగా ఉండకపోతే ఇబ్బందులు ఎదురవుతాయని భావిస్తున్నారట. రాష్ట్ర పరిస్థితులను రేవంత్ మొన్న ఢిల్లీ పెద్దలకు తెలిపినట్టు సమాచారం. ఏదేమైనా అనుకున్న టార్గెట్ రీచ్ కావాలని, ఎవరు అడ్డు చెప్పినా తాము చూసుకుంటామని హై కమాండ్ చెప్పడంతో రేవంత్ తన బాధ్యతను కంప్లీట్ చేసే పనిపై పూర్తి దృష్టి పెట్టారు.లోకల్ బాడీ ఎన్నికల కోసం పార్టీని పటిష్టం చేయడంతో పాటు ప్రభుత్వ సుస్థిర‌త‌ను కాపాడుకోవడం కోసం తీసుకోవాల్సిన నిర్ణయాలను ఢిల్లీ టూర్ లో రేవంత్ రెడ్డి అధిష్ఠానానికి తెలియచేశారట. పార్లమెంట్ ఎన్నికల ముందు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కోసం కాంగ్రెస్ గేట్లు తెరిచామని ప్రకటించిన హస్తం నేతలు చేరికలకు కొద్ది రోజులు విరామం ప్రకటించారు. ఇక ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో తమతో కలిసి వస్తామని గతంలో చెప్పిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో టచ్ లోకి వెళ్తున్నారు. పార్లమెంట్ ఎన్నిక‌ల్లో బీఆర్‌ఎస్ పార్టీ ఒక్క సీటు కూడా సాధించకపోవడంతో ఆ పార్టీ ఎమ్మెల్యేలు తమ భవిష్యత్తు కోసం నిర్ణయం తీసుకునే ఆలోచనలో పడ్డట్టు సమాచారం. మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి తెచ్చేందుకు బీజేపీ సైతం ప్రయత్నాలు మొదలు పెట్టింది. దీంతో ఎమ్మెల్యేలను బీజేపీలోకి వెళ్లకుండా కట్టడి చేయడం, తమతో కలుపుకుపోవడం వెంటనే జరగాలని హస్తం నేతలు భావిస్తున్నారు.ఎమ్మెల్యేల‌తో పాటు ఎమ్మెల్సీల‌పై కూడా కాంగ్రెస్ ఫోక‌స్ పెట్టింది. మెజారిటీ ఎమ్మెల్సీలు త‌మ‌కు నెక్ట్స్ ట‌ర్మ్ రెన్యూవ‌ల్ చేస్తే చేరేందుకు రెడీగా ఉన్నట్లు సమాచారం. అయితే పార్టీ పాల‌సీ ప్రకారం ముందే హామీ ఇవ్వలేమ‌ని పార్టీలో చేరితే మాత్రం సముచిత స్థానం క‌ల్పిస్తామ‌ని ముఖ్యనేత‌లు హామీ ఇస్తున్నారట. దీంతో రాత్రికి రాత్రే ఆరుగురు MLCలు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఇంకో 9 మంది MLC లను పార్టీలోకి ఆకర్షించి 2/3 మెజార్టీ కంప్లీట్ చేస్తే, BRS విలీనం చేసుకునే యోచనలో కాంగ్రెస్ ఉంది. ఎమ్మెల్సీల‌ను కూడా కాంగ్రెస్ గూటికి చేర్చుకొని పెద్దల స‌భ‌ను కూడా త‌మ ఆధీనంలోకి తీసుకోవాల‌ని కాంగ్రెస్ భావిస్తోంది. భవిష్యత్తులో ప్రభుత్వం తీసుకొచ్చే కీల‌క బిల్లుల‌కు ఎలాంటి ఆటంకం క‌ల‌గ‌కుండా ఉండాలంటే మండ‌లిలో కూడా మెజారిటీ సాధించాల‌ని పార్టీ నిర్ణయం తీసుకొని ఎమ్మెల్సీలతో మాట్లాడే బాధ్యతను పలువురు మంత్రులకు అప్పచెప్పినట్టు సమాచారం.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్