Sunday, September 8, 2024

కాంగ్రెస్ బిజెపిలు మోసపూరిత వాగ్దానాలతో మభ్యపెట్టాలని చూస్తుండ్లు

- Advertisement -

అధికారంలో ఉండి బీసీ రిజర్వేషన్‌ చట్టాలను తీసుకురాలే

మంథనిలో బీపీ మండల విగ్రహాన్ని పెట్టిన ఘనత పుట్టమధుదే

బీసీ బిడ్డ పుట్ట మధూకర్‌కు సమాజ్‌వాద్‌ పార్టీ సంపూర్ణ మద్దతు

సమాజ్‌వాద్‌ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మారం తిరుపతియాదవ్‌

మంథని:  దేశంలో అనేక ఏండ్లుపరిపాలన చేసిన బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు బీసీ బలహీనవర్గాలను మోసపూరిత వాగ్దానాలతో మభ్యపెట్టి మోసం చేసేందుకు కుట్రలు చేస్తున్నారని  సమాజ్‌ వాద్‌ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మారం తిరుపతి యాదవ్‌ అన్నారు. గురువారం మంథని ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సమాజ్‌వాద్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు అఖిలేష్‌ యాదవ్‌, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు సింహద్రి సూచన మేరకు మంథనిలో బీసీ బిడ్డ బలహీనవర్గాలకు చెందిన నాయకులు బీఆర్‌ఎస్‌ అభ్యర్థి పుట్ట మధూకర్‌కు సమాజ్‌వాద్‌ పార్టీ సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు.  ములాయంసింగ్‌ యాదవ్‌ పేద కుటుంబం నుంచి వచ్చి మూడు సార్లు ఉత్తప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా, రెండు పర్యాయాలు దేశ రక్షణ మంత్రిగా పనిచేశారని వివరించారు. తెలంగాణలో ఎక్కడా లేనివిధంగా బీపీ మండల విగ్రహాన్ని మంథని నడి ఒడ్డున ఏర్పాటు చేసిన ఘనత కేవలం బీసీ బిడ్డ పుట్ట మధుకే దక్కుతుందని ఆయన పేర్కొన్నారు దేశంలో కాంగ్రెస్‌ బీజేపీ చాలా కాలం అధికారంలో ఉన్నా బీసీలకు రాజ్యాధికారం అందించలేదన్నారు.

ఈనాడు ఓ పార్టీ అదికారంలోకి వస్తే బీసీ ముఖ్యమంత్రి అని, మరోసారి కులగణన చేపడుతామని ప్రకటనలు చేస్తున్నారని విమర్శించారు. అయితే బీజేపీ కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో బీసీ ముఖ్యమంత్రిని, కులగణన ఎందుకు సాధ్యం కావడం లేదని ఆయన ప్రశ్నించారు.

బీసీ రిజర్వేషన్‌ చట్టం వాళ్ల చేతుల్లో ఉన్న సమయంలో పార్లమెంట్‌లో చట్టాన్ని తీసుకువచ్చినప్పుడు బీసీ ముఖ్యమంత్రి ప్రకటన చేయాల్సిన అవసరం లేదన్నారు. అలాంటి చట్టం వస్తే దేశంలో సగం రాష్ట్రాలకు బీసీలు ఏ పార్టీలో ఉన్నా ముఖ్యమంత్రి అయ్యేవారని అన్నారు. అలాంటి చట్టాన్ని కాంగ్రెస్‌ బీజేపీ పార్టీలు ఎందుకు తీసుకురాలేదని ఆయన ప్రశ్నించారు.మంథని నియోజకవర్గంలో బీసీలను అణగదొక్కేందుకు అగ్రకులానికి చెందిన ఎమ్మెల్యే అభ్యర్థి పెద్ద కుట్ర చేస్తున్నారని  అలాంటి వారి కుట్రను పటాపంచలు చేసి బీసీ బిడ్డ పుట్టమధుకు ప్రజలు బ్రహ్మరథం పట్టాలని ఆయన అన్నారు రాష్ట్రంలో నమ్మదగిన విశ్వాసం ఉన్న నాయకులు సీఎం కేసీఆర్‌ అని ఆయన నాయకత్వంలోనే బీసీ వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు.

మంథని నియోజకవర్గంలో బీసీ బిడ్డ పుట్ట మధూకర్‌ గెలుపు కోసం ప్రతి కార్యకర్త, నాయకులు, అభిమానులు కలిసి కట్టుగా ప్రచారం చేయాలని, ఆయన గెలుపుతోనే బీసీ వర్గాలకు మేలు జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈ సమావేశంలో పెద్దపల్లి మండల అధ్యక్షుడు బత్తిని లక్ష్మణ్ జూలపల్లి మండలాధ్యక్షుడు మారం వెంకటరమణ ఎండి సర్వర్లు పాల్గొన్నారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్