- Advertisement -
రైతులకోసం మరిన్నీ గిడ్డంగుల నిర్మాణం-మంత్రి అచ్చెన్నాయుడు
Construction of more warehouses for farmers - Minister Achchennaidu
కాకినాడ
మార్కెట్ కమీటీ స్థలాలో రైతులు ఉత్పత్తులను నిల్వచేసుకు నేందుకు మరిన్ని గిడ్డంగులు నిర్మి స్తామని రాష్ట్ర వ్యవసాయ, సహ కార, మార్కెటింగ్, పశుసంవర్థన, డైరీ డవలెప్ మెంట్, మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలియజేశారు.కాకినాడ సామ ర్లకోటలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ద్వారా నిర్మించిన నూతన గిడ్డంగిని మంత్రి అచ్చెన్నాయుడు ప్రారం భించారు.10 కోట్ల 3 లక్షల వ్య యంతో 3.94 ఎకరాల విస్తీర్ణంలో 10వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం తో ఈ గిడ్డంగిని నిర్మించారు. జిల్లాలో ఇప్పటికే గొల్లప్రోలులో 10 వేలు, కిర్లంపూడిలో 15 వేలు, నడకుదురులో 27100 మెట్రిక్ టన్నుల సామర్థంతో రాష్ట్ర గిడ్డం గుల సంస్థ గౌడన్లు ఉండగా, వ్యవ సాయ, పౌరసరఫరాల అవసరాల మేరకు సామర్లకోటలో ఈ గిడ్డంగి నిర్మించారు.ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే నిమ్మకాయ చినరాజప్ప అధ్యక్షతన నిర్వహించిన సభకు మంత్రి అచ్చెన్నాయుడు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.ఈ సంద ర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ 2014 నుండి 2019 వరకూ స్వర్ణయుగంలో సాగిన రాష్ట్రం 2019 నండి 2024 వరకూ అన్ని వ్యవస్థలు సర్వనాశనమై అంధకారంలోకి జారి పోయింద న్నారు.కూటమి ప్రభుత్వం గత జూన్ 12 పాలన చేపట్టి ఏ శాఖ సమీక్ష చేపట్టిన గుదిబండలా అప్పులు తప్ప ఒక్క పైసా అందుబాటులో లేదని, 14 కోట్ల అప్పు వారసత్వంగా మిగిలిందని వాపోయారు.రైతు బాజార్లు, కలెక్టరు ఆఫీసులు, ఆఖరికి రాష్ట్ర సెక్రటేరియట్ కూడా తాకట్టులో ఉందని, ఇసుక, మట్టి, గ్రావెల్ తదితర సహజ వనరులు అన్నీ దోపిడికి గురైయన్నారు. లాండ్ టైటిలింగ్ చట్టం పేరుతో ప్రజల ఆస్తులే గల్లంతు చేసే ముప్పు ఎదురైందని,ప్రజలు విజ్ఞతతో ఓటువేసి వెంటిలేటర్ పై ఉన్న రాష్ట్రాన్ని తిరిగి బ్రతికించారని, 22 మంది ఎంపిలను గెలిపించడంతో కేంద్రంలో మన గౌరవం పెరిగి కేంద్రప్రభుత్వం రాష్ట్రాన్ని అన్ని విధాలా ఆదుకుంటోందన్నారు. సమస్యలు ఎన్ని ఉన్నా ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమర్థ నాయకత్వం, అంకితభావంతో రాష్ట్రం మరల అభివృద్ది బాటలో పయనిస్తోందని, 6 మాసాలలోనే మనపై నమ్మకం పెరిగి పరిశ్రమల స్థాపనకు లక్షా 80 వేల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయన్నారు. దివాళా తీసిన ఆర్ధిక పరిస్థితిని చక్కదిద్దూతూ, సూపర్ సిక్స్ పేరిటి ఇచ్చిన హామీలన్నిటినీ ఒక్కటొక్కటిగా కూటమి ప్రభుత్వం అమలు చేస్తోందని, దేశంలో అత్యధికంగా 4వేలు, 6 వేలు, 15 వేలు సామాజిక పించన్లు ఇస్తున్న రాష్ట్ర అంధ్రప్రదేశ్ ఒక్కటేనన్నారు. అన్నకేంటీన్ల ద్వారా 5 రూపాయలకే పేదలకు భోజనం అందిస్తున్నామ ని, పేద మహిళలందరికీ వంటగ్యా స్ ఉచితంగా పంపిణీ చేస్తున్నా మని తెలియజేశారు.
- Advertisement -