Tuesday, January 14, 2025

నిర్మాణ పనులు మరింత వేగవంతం చేయాలి

- Advertisement -

నిర్మాణ పనులు మరింత వేగవంతం చేయాలి

Construction work should be accelerated

జిల్లాలో జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులు తదితర ప్రాజెక్టుల భూసేకరణ, నిర్మాణ పనులు మరింత వేగవంతం చేయాలి
జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి,
జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్ట్ పనులు, తిరుపతి రేణిగుంట బైపాస్ రోడ్డుకు సంబంధించిన పలు భూ సంబంధిత పెండింగ్ అంశాలపై, నిర్మాణ పనులపై
ఎన్హెచ్ఎఐ, రెవెన్యూ సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి సారించి మరింత వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు.

మంగళవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో జాతీయ రహదారులకు, రైల్వే ప్రాజెక్ట్ పనులకు, తిరుపతి రేణిగుంట బైపాస్ రోడ్డు తదితరాలకు సంబంధించిన పలు భూ సంబంధిత పెండింగ్ అంశాలపై, నిర్మాణ పురోగతిపై జెసి శుభం బన్సల్ తో కలిసి వర్చువల్ విధానంలో  ఎన్హెచ్ఎఐ పిడి లు, సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా,  ఆర్డీఓ లు తిరుపతి, సూళ్లూరుపేట, శ్రీకాళహస్తి రామ్మోహన్, కిరణ్మయి, భాను ప్రకాష్ రెడ్డి సంబంధిత  మండలాల తాసిల్దార్లు తదితర సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి దిశా నిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తిరుపతి జిల్లాలో జాతీయ రహదారుల అభివృద్ధి కొరకు చేపడుతున్న జాతీయ రహదారుల నిర్మాణ పనులు పురోగతిలో ఉన్న కడప – రేణిగుంట , తిరుపతి – మదనపల్లి , రేణిగుంట – నాయుడుపేట 6 లేన్ వంటి రహదారులు నిర్మాణం, తిరుపతి బైపాస్ (కాలూరు క్రాస్ నుండి రేణిగుంట వరకు) 6 లేన్ల రహదారి వేగవంతం చేయాలని సూచించారు. అలాగే రేణిగుంట నుండి చెన్నై వరకు 4 లేన్ల రహదారి విస్తరణ పనులు కూడా ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని భూ సేకరణలో సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు.

కృష్ణపట్నం పోర్ట్  సమీపంలో నాయుడుపేట – తూర్పు కనుపూరు 6 లేన్ల రహదారి 35 కి.మీ, చిల్లకూరు క్రాస్ నుండి తూర్పు కాన్పూర్ వరకు 4 లేన్ల రహదారి  మరియు తూర్పు కాన్పూర్ నుండి కృష్ణపట్నం పోర్ట్ సౌత్ గేట్ 6 లేన్ల రహదారి 36 కి.మీ, తమ్మినపట్నం నుంచి నారికెళ్లపల్లెను కలుపుతూ గ్రీన్ ఫీల్డ్ రోడ్డు 4 లేన్లు,  పోర్ట్ రోడ్డు పొడిగింపు 6 లేన్ల రహదారి 16 కి.మీ అభివృద్ది పనులు కూడా టైం లైన్ మేరకు పూర్తి చేయాలనీ సూచించారు. పారిశ్రామిక రంగానికి జాతీయ రహదారుల నిర్మాణం ద్వారా మరింత  సౌకర్యం కలగనున్నదనీ తెలిపారు. భూసేకరణ పెండింగ్ అవార్డులు త్వరిత గతిన నిబంధనల మేరకు చేపట్టేలా ఉండాలని తెలిపారు. ప్యాకేజీ 2,3,4 జాతీయ రహదారి పనులు సాగరమాల కింద చేపట్టిన వాటిని పెండింగ్ లేకుండా రెవెన్యూ డివిజనల్ అధికారులు ఎన్ హెచ్ అధికారులు సమన్వయంతో నిర్దేశించుకున్న లక్ష్యాలను త్వరిత గతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.

చెన్నై జాతీయ రహదారి 205 కి సంబంధించిన విస్తరణ కొత్త ప్రతిపాదనలకు చెందిన భూసేకరణ చేపట్టాలని, అలాగే రైల్వే ప్రాజెక్టులు నడికుడి శ్రీకాళహస్తి ప్రాజెక్ట్ కు సంబంధించిన భూ సేకరణలో ఇబ్బందులు లేకుండా ఆర్డీఓ లు, తాశిల్దార్లు చర్యలు తీసుకోవాలని సూచించారు. తిరుపతి పాకాల రైల్వే ట్రాక్ డబుల్ లైన్ కు సంబంధించిన భూ సేకరణ పనులలో పురోగతి ఉండాలని తెలిపారు. అలాగే తిరుపతి రేణిగుంట బైపాస్ సంబంధించిన పెండింగ్ భూ సమస్యలను పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని ఆర్డీఓ లను ఆదేశించారు.

ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి నరసింహులు, పిడి ఎన్హెచ్ఎఐ లు తిరుపతి వెంకటేష్, నెల్లూరు ఎంకే చౌదరి, చెన్నై రవీంద్రరావు, తాసిల్దార్లు, విఆర్ఓ లు, కలెక్టరేట్ విభాగం డిటి భాస్కర్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్