ఎంపీ వద్దిరాజు మాగంటి కుటుంబ సభ్యులకు పరామర్శ
Consultation with family members of MP Vaddiraju Maganti

రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర మాజీ మంత్రులు కే.టీ.రామారావు, తన్నీరు హరీష్ రావు, పువ్వాడ అజయ్ కుమార్ తదితర ప్రముఖులతో కలిసి దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పార్థివదేహాన్ని సందర్శించి ఘనంగా నివాళులర్పించారు.గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచిన గోపీనాథ్ భౌతికకాయాన్ని మాదాపూర్ డాక్టర్స్ కాలనీలోని ఆయన నివాసానికి తరలించారు.ఎంపీ రవిచంద్ర, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు తన్నీరు హరీష్ రావు, పువ్వాడ అజయ్ కుమార్ తదితర ప్రముఖులతో కలిసి గోపీనాథ్ పార్థివదేహాన్ని సందర్శించి పూలదండలు వేసి పూలుజల్లి శ్రద్ధాంజలి ఘటించారు.గోపీనాథ్ సతీమణి సునీత, కుమారుడు వాత్సల్యనాథ్, కుమార్తెలు అక్షర నాగ,దిశిరలను కేటీఆర్, హరీష్ రావు,రవిచంద్రలు ఓదార్చి తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.


