- Advertisement -
కంటైనర్ బీభత్సవం.. డీసీఎం డ్రైవర్ మృతి
Container accident.. DCM driver died
హైదరాబాద్
ముషీరాబాద్ చౌరస్తాలో సోమవారం తెల్లవారుజామున రెడీమిక్స్ కంటైనర్ వేగంగా వచ్చి మూడు డిసిఎంలు, ఒక టాటా ఏసీ, ఓ ద్విచక్ర వాహనాన్ని, పోలీస్ రక్షక వాహనాన్ని ఢీ కొట్టింది. తెల్లవారుజామున రెండున్నర గంటల ప్రాంతంలో ముషీరాబాద్ చౌరస్తాలో ఈ సంఘటన చోటుచేసుకుంది. నిద్ర మత్తులో ఉన్న కంటైనర్ డ్రైవర్ మహ్మద్ యూసుఫ్ నిర్లక్ష్యంగా వాహన నడిపి బీభత్సం సృష్టించాడు. ఈ ఘటనలో ఓ డి సి ఎం డ్రైవర్ మృతి చెందాడు. మరో ముగ్గురికి గాయాలు అయ్యాయి. చికిత్స కోసం క్షతగాత్రులను గాంధీ ఆస్పత్రికి తరలించారు. చిలకలగూడ పోలీసులు కంటైనర్ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. రెండున్నర గంటల ప్రాంతంలో ముషీరాబాద్ చౌరస్తాలో వెహికల్ చెకింగ్ కోసం నిలిపిన ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ సంబంధించిన రక్షక్ వాహనాన్ని సైతం కంటైనర్ ఢీకొట్టింది.
ముషీరాబాద్ ఎస్ఐ, రక్షక వాహనంలో ఉన్న పోలీస్ సిబ్బంది ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు.
- Advertisement -