ఉమ్మడి వరంగల్ పై కొనసాగుతున్న సందిగ్థత

- Advertisement -

వరంగల్, అక్టోబరు 25, (వాయిస్ టుడే):  ఉమ్మడి వరంగల్​ జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో 9 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ అధిష్ఠానం.. మూడు స్థానాలను మాత్రం పెండింగ్​ లో పెట్టింది. అందులో పరకాల, నర్సంపేట, ములుగు నియోజకవర్గాలుండగా.. ఆయా సెగ్మెంట్లలో బీఆర్​ఎస్​, కాంగ్రెస్​ అభ్యర్థులకు ధీటుగా ఎవరిని ప్రకటిస్తారోననే చర్చ సాగుతోంది.బీజేపీ ఫస్ట్ లిస్ట్ పై పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇన్​ఛార్జ్​ ప్రకాశ్​ జావడేకర్​ ఆధ్వర్యంలో పార్టీ రాష్ట్ర కోర్​ కమిటీ దాదాపు మూడు రోజుల పాటు తీవ్ర కసరత్తు చేసింది. అనంతరం బీజేపీ సెంట్రల్ ఎలక్షన్​ కమిటీ ఆమోదంతో 52 మంది అభ్యర్థులను ఖరారు చేయగా.. అందులో తొమ్మిది మంది ఉమ్మడి వరంగల్​ జిల్లాకు చెందిన వారే కావడం గమనార్హం.ఇందులో జనరల్ స్థానాలైన వరంగల్​ ఈస్ట్ టికెట్​ ను ఎర్రబెల్లి ప్రదీప్​రావు, వరంగల్ వెస్ట్ రావు పద్మ, జనగామ ఆరుట్ల దశమంత్​ రెడ్డి, భూపాలపల్లి చందుపట్ల కీర్తిరెడ్డి, పాలకుర్తి లేగా రాంమోహన్​ రెడ్డి, ఎస్సీ రిజర్వ్​ అయిన స్టేషన్​ ఘన్​పూర్​ డాక్టర్​ గుండె విజయరామారావు, వర్ధన్నపేట కొండేటి శ్రీధర్​, ఎస్టీ రిజర్వ్​ అయిన మహబూబాబాద్​ జాటోత్​ హుస్సేన్ నాయక్​, డోర్నకల్​ భూక్య సంగీతకు కేటాయించారు. దీంతో టికెట్లు దక్కిన అభ్యర్థులు సంతోషంతో సంబరాలు చేసుకోగా.. టికెట్ ఆశలు పెట్టుకున్న మిగతా వాళ్లంతా నిరాశలో పడ్డారు.

Continuity over joint Warangal
Continuity over joint Warangal

నర్సంపేట సెగ్మెంట్ లో సిట్టింగ్​ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్​ రెడ్డికి ప్రత్యర్థిగా మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్​ రెడ్డిని బరిలో దించేందుకు బీజేపీ అధిష్టానం కసరత్తు చేసింది. కానీ అనూహ్యంగా రేవూరి ప్రకాశ్​ రెడ్డి ఇటీవల కాంగ్రెస్​ లో చేరి బీజేపీ భారీ షాక్​ ఇచ్చారు. పరకాలలో కాంగ్రెస్​ నుంచి పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఇదివరకు ఇదే స్థానం నుంచి బీజేపీ టికెట్ ఆశించిన యువ నేత గోగుల రాణాప్రతాప్​ ను వివిధ కారణాలతో పార్టీ నుంచి సస్పెండ్​ చేశారు.దీంతో ప్రత్యామ్నాయంగా నర్సంపేట నియోజకవర్గంలో పోటీలో నిలిచే నాయకులు లేకుండా పోయారు. కాగా వరంగల్​ పశ్చిమ టికెట్ ఆశించిన బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, యూత్​ ఫైర్​ బ్రాండ్​ గా పేరున్న ఏనుగుల రాకేశ్​ రెడ్డిని నర్సంపేట నుంచి బరిలో దించేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. కానీ ఆయన నిరాకరించగా.. నెక్కొండ మండలానికి చెందిన ఓ మాజీ ఎంపీపీ పేరు పార్టీ నేతలు పరిశీలిస్తున్నట్లు సమాచారం.పరకాల నియోజకవర్గ టికెట్​ ను ప్రజల డాక్టర్ గా పేరున్న డా.కాళీ ప్రసాద్​, రెడ్​ క్రాస్​ చైర్మన్​ గా ఉన్న డా.పెసరు విజయచందర్​ రెడ్డి ఆశిస్తున్నారు. వైద్య సేవలందిస్తూ జనాల్లో మంచిపేరు సంపాదించడం, యూత్​ లోనూ మంచి పట్టు ఉండటంతో టికెట్ డాక్టర్​ కాళీ ప్రసాద్​ కేనని అంతా భావించారు. అందులోనూ హుజురాబాద్​ ఎమ్మెల్యే ఈటల రాజేందర్​ కు సన్నిహితుడిగా పేరున్న కాళీప్రసాద్​ టికెట్ తనకే దక్కుతుందన్న ధీమాతో ఇప్పటికే ప్రచార కార్యక్రమాలు కూడా ముమ్మరం చేశారు. కానీ ఫస్ట్​ లిస్ట్​ లో పేరు లేకపోవడంతో ఆయనా గందరగోళంలో పడ్డారు.ఇదిలాఉంటే బీసీ కోటాలో టికెట్​ ఆయనకే దక్కే అవకాశం ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇక ములుగు సెగ్మెంట్​ ను కూడా బీజేపీ పెండింగ్​ లో పెట్టగా.. ఇక్కడ మాజీ మంత్రి అజ్మీరా చందూలాల్​ కుమారుడు అజ్మీరా ప్రహ్లాద్​ టికెట్​ ఆశిస్తున్నారు. ఆయనతో పాటు బంజారా సామాజిక వర్గానికి చెందిన భూక్యా జవహర్​ లాల్​ కూడా బీజేపీ టికెట్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. కాగా టికెట్ల కేటాయింపులో ఆచితూచీ వ్యవహరిస్తున్న బీజేపీ.. ఈ మూడు నియోజకవర్గాల్లో ఎవరిని ఫైనల్ చేస్తుందో చూడాలి.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular