నాణ్యతపై నిరంతర పర్యవేక్షణ.
Continuous monitoring of quality.
జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ.
జయశంకర్ భూపాలపల్లి,
సంక్షేమ, అంగన్వాడీ, పాఠశాలల్లో బియ్యం, సరుకుల నాణ్యతను ఖచ్చితంగా పాటించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. బుధవారం జిల్లాలోని గణపురం మండల కేంద్రంలోని జడ్పిఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులను భోజనం ఎలా ఉంటుంది, కూరలు బావుంటున్నాయా అడిగి తెలుసుకున్నారు. బియ్యం, సరకులు స్టోర్ ను పరిశీలించారు. బియ్యం కానీ సరుకులు కానీ బాగా లేకపోతే తక్షణమే మార్చాలని, తప్పనిసరి నాణ్యత పాటించాలని సూచించారు. ఆహార తనిఖీలు చేయాలని
మండల ప్రత్యేక అధికారులను, తహసీల్దార్లును, ఎంపీడీవోలకు సూచించారు.
సంక్షేమ వసతి గృహాలు, అంగన్వాడీ కేంద్రాలు, మధ్యాహ్న భోజన పథకాల్లో పిల్లలు, విద్యార్థులకు అందిస్తున్న ఆహారం శుభ్రత, పోషకాహార విలువలు కలిగి ఉండేలా చూడాలని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మెనూ పాటించాలని సూచించారు. అధికారుల పర్యవేక్షణలో ఏవైనా లోపాలు ఉంటే తక్షణమే న చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నాణ్యతా ప్రమాణాలను పాటించే విధంగా తనిఖీలు నిర్వహించి, నివేదికలు సమర్పించాలని కలెక్టర్ సూచించారు. విద్యార్థుల, చిన్నారుల ఆరోగ్యం, శ్రేయస్సు చాలా ముఖ్యమని ప్రతి ఒక్కరూ ఈ నాణ్యతా ప్రమాణాలను పాటించాల్సిన అవసరం ఉందని ఆయన ఆదేశించారు. ఈ సందర్భంగా విద్యార్థులు జిల్లా కలెక్టర్ కు మొక్కను అందించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్ విజయలక్ష్మి మండల ప్రత్యేక అధికారి కుమారస్వామి, డిఆర్డీఓ నరేష్, తహసిల్దార్ సత్యనారాయణ స్వామి, ఎంపీడీవో భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.