అభివృద్ధికి సహకరించండి. అవినీతిని నిలదీయండి.
ఎమ్మెల్యే బొలిశెట్టి పిలుపు
తాడేపల్లిగూడెం,శుక్రవారం18.
Contribute to development. Stop corruption.
అభివృద్ధి విషయంలో ప్రజలందరూ కూటమి ప్రభుత్వానికి సహకరించాలని,ఏ స్థాయిలో అవినీతి జరిగినప్రజలు నిలదీయాలని తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. నియోజకవర్గంలోని ఆరుళ్ల, పడమర విప్పర్రు గ్రామంలో జరిగిన పల్లె పండుగ కార్యక్రమంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన రెండు గ్రామాల్లో జరిగిన సభల్లో ప్రజలతో మమేకమై మాట్లాడారు. పడమర విప్పర్రు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సాక్షిగా విప్పరు గ్రామాన్ని తాడేపల్లిగూడెం నియోజకవర్గం లో ముందు వరుసలో నిలబెడతానని హామీ ఇచ్చారు. గ్రామంలో గ్రూపు తగాదాలతో అభివృద్ధికి ఆటంకం కలిగించవద్దని ఆయన కోరారు.ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహకారంతో తాడేపల్లిగూడెం నియోజకవర్గం అభివృద్ధికి ప్రణాళిక బద్ధంగా ముందుకు వెళ్తున్నామని అవసరమైతే ప్రజా సహకారంతో అభివృద్ధి చేసేందుకు తన సొంత నిధులు కూడా వెచ్చించడానికి సిద్ధంగా ఉన్నానని అందరూ సహకరించాలని ఆయన కోరారు. చిన్న చిన్న సమస్యలు ఉంటే గ్రామంలోనే పరిష్కరించుకోవాలి తప్ప, పై స్థాయి వరకు తీసుకెళ్లడం ద్వారా గ్రామాల అభివృద్ధిపై ప్రభావం చూపుతుందని పెద్ద తరహాలా వ్యవహరించాలని కోరారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గం లో అత్యధిక మెజారిటీతో తనను గెలిపించిన ప్రజలకు సేవ చేయడానికి నిరంతరం సిద్ధంగా ఉన్నానని, ప్రతి ఇంటి సమస్యను పరిష్కరించడానికి ప్రణాళిక బద్ధంగా పనిచేస్తున్నామన్నారు. విప్పర్రు గ్రామం వెళ్లేందుకు గంట సమయం పైగా పట్టిందని రోడ్డును త్వరితగతిన పూర్తి చేసేందుకు 40 లక్షల వ్యయంతో ఆర్ఎంపీ అధికారులకు వెంటనే పని పూర్తి అయ్యేలా ఆదేశాలు ఇచ్చామన్నారు. ఎప్పటి నుంచో గణపవరం రహదారిని కూడా నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నామని రోడ్డు నాణ్యత విషయంలో ప్రజలు బాధ్యత తీసుకొని నాణ్యతాపరమైన లోపాలు లేకుండా పనులు జరిగేందుకు అందరూ సిద్ధంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ హైమావతి,టెంటూ నాగమణి,పసల అచ్చుతం,పుల్లా బాబీ,గంటా సుబ్రమణ్యం, పసుపులేటి అమ్మిరాజు, కొడవటిగంట్టి వెంకట నరసింహాచార్యులు, పాలూరు వెంకటేశ్వరరావు మరియు ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.




