హెచ్ విడిసి సాంకేతికత అమలులో సహకారం అందించండి
Contribute to implementation of HVDC technology
వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ల నిర్మాణాన్ని వేగవంతం చేయండి
హిటాచీ ఇండియా ఎండి భరత్ కౌశల్ తో మంత్రి లోకేష్ భేటీ
దావోస్:
హిటాచీ ఇండియా ఎండి భరత్ కౌశల్ తో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ దావోస్ బెల్వెడేర్ లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ… సమర్థవంతమైన పవర్ ట్రాన్స్ మిషన్ కోసం రాష్ట్రంలో హెచ్ విడిసి (హై వోల్టేజి డైరక్ట్ కరెంట్) వంటి అధునాతన సాంకేతికతలను అమలు చేయడంలో సహకరించండి. వైజాగ్ మెట్రో ప్రాజెక్టు, గ్రీన్ ఎనర్జీ కార్యక్రమాలకు సాంకేతిక సహకారాన్ని అందించండి. సస్టెయినబుల్ డెవలప్ మెంట్ గోల్ లక్ష్యానికి అనుగుణంగా ఇన్నొవేషన్ పార్కు స్థాపనకు మద్దతునివ్వండి. ఎనర్జీ సెక్టార్ లో వైవిధ్యమైన టాలెంట్ పూల్ ను అభివృద్ధి చేయడానికి స్కిల్ డెవలప్ మెంట్ ఇనిషియేటివ్స్ లో చేయూతనివ్వండి. రాష్ట్రంలో 3 వేస్ట్-టు-ఎనర్జీ (WtE) ప్లాంట్‌ల (కడప, అనంతపురం, తాడేపల్లిగూడెం) ఏర్పాటుకు సంబంధించి గత ప్రణాళికలను పునఃపరిశీలించి… వాటిని గ్రౌండింగ్ చేసే కార్యక్రమాలను వేగవంతం చేయండి. ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేకించి వైజాగ్, విజయవాడ, తిరుపతి పరిసర ప్రాంతాల్లో స్థలం, ప్రతిభగల యువ నిపుణులు అందుబాటులో ఉన్నారు. 2030నాటికి 78 గిగావాట్ల సోలార్, 35 గిగావాట్ల సోలార్ ఎనర్జీ లక్ష్యంగా క్రీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీలను ఎపి ప్రభుత్వం ప్రకటించిందని మంత్రి లోకేష్ తెలిపారు.
హిటాచీ ఇండియా ఎండి భరత్ కౌశల్ మాట్లాడుతూ… హిటాచీ ఇండియా రాబోయే నాలుగైదేళ్లలో భారత్ లో తమ కార్యకలాపాల విస్తరణ, అప్ గ్రేడేషన్, ఎనర్జీ ట్రాన్స్ మిషన్, ట్రాన్సిషన్ ప్రొడక్ట్ విభాగాల అభివృద్ధికి రూ.2వేల కోట్లు పెట్టుబడి పెట్టాలని భావిస్తోంది. జాన్సన్ కంట్రోల్స్-హిటాచీ ఎయిర్ కండిషనింగ్ ఇండియా లిమిటెడ్ (JCH-IN) సంయుక్త ఆధ్వర్యంలో తిరుపతి, విజయవాడ, కాకినాడలో బహుళ నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను ప్రారంభించింది. అనంతపురం బొబ్బిలిలో మరో రెండు కేంద్రాలు ఏర్పాటు చేయబోతున్నాం. 2018లో ఆంధ్రప్రదేశ్‌లో మూడు వేస్ట్-టు-ఎనర్జీ (WtE) ప్లాంట్‌లను నిర్మించడానికి హిటాచీ జోసెన్ ఇండియా కాంట్రాక్టులను పొందింది. ఈ ప్లాంట్‌లను కడప, అనంతపురం, తాడేపల్లిగూడెంలలో స్థాపించాలని నిర్ణయించాం. కంపెనీ సహచరులతో చర్చించి ఈ ప్లాంట్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటాం. రియల్ టైమ్ డేటా అనలిటిక్స్ ద్వారా పబ్లిక్ సర్వీస్ డెలివరీని మెరుగుపరిచే సిస్టమ్‌లను హిటాచీ అభివృద్ధి చేస్తోందని చెప్పారు.