Thursday, May 21, 2026

కేసులలో శిక్షల శాతం కన్వెక్షన్ రేట్ పెంచాలి

- Advertisement -

కేసులలో శిక్షల శాతం కన్వెక్షన్ రేట్ పెంచాలి

Conviction rate should be increased as percentage of punishment in cases

పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ

సిద్దిపేట

కేసులలో నిందితులకు శిక్షలు పడేటట్టు  కోర్టు కానిస్టేబుల్ కీలక పాత్ర వహించాలి.
నాన్ బేలబుల్ వారెంట్స్ ఎగ్జిక్యూటివ్ చేయాలి.
బాధితులకు  న్యాయం జరగాలంటే కేసుల్లో నిందితులకు శిక్షలు పడాలి
. క్రమశిక్షణతో పారదర్శకంగా విధులు నిర్వహించాలి
పోలీస్ వ్యవస్థపై నమ్మకం పెంచాలి
పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ  అన్నారు.
కోర్టు డ్యూటీ విధులు నిర్వహించే సిబ్బంది సిడిఓ తో కమిషనర్ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించిన  పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ
ఈమాట్లాడుతూ.  క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్, ఎస్సీ ఎస్టీ ఫోక్సో  మర్డర్, రాబరీ  కేసులలో శిక్షల శాతం కన్వెక్షన్ రేట్, పెంచాలని, నిందితులకు శిక్షలు పడేటట్లు  సాక్షులను మోటివేషన్ చేయాలని తెలిపారు. ప్రతి కేసులో క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ ఉండాలని  సాక్ష్యం చెప్పే సమయంలో సాక్షులకు కోర్టులో సాక్ష్యం చెప్పే విధంగా మోటివేట్ చేయాలని సూచించారు. సాక్షులను షెడ్యూల్ ప్రకారం  తప్పకుండా కోర్టులో హాజరు పరచాలని సూచించారు. కోర్టు కానిస్టేబుల్ యూనిఫాం వేసుకుని కోర్టుకు వెళ్లాలని సూచించారు. నాన్ బేలబుల్ వారెంట్  వెంటనే ఎగ్జిక్యూట్ చేయాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ట్రయిల్ బేక్ కావద్దని తెలిపారు.  ఫోక్సో, ఎస్సీ ఎస్టీ  మరియు గ్రేవ్ కేసులలో  సంబంధిత సాక్షులను కోర్టులో సాక్ష్యం చెప్పే విధంగా మోటివేట్ చేయాలని సూచించారు. నేరస్థులకు కేసులలో శిక్షలు పడితే నేరాలు తగ్గుముఖం పడతాయన్నారు. మరియు నేరస్తులలో మార్పు వస్తుందన్నారు, నేరస్తులకు శిక్ష పడితే ప్రజలలో భద్రతా భావం పెరుగుతుందన్నారు. ప్రజల భద్రతా భావాన్ని పెంచడం మనందరి బాధ్యతని తెలిపారు. నేరస్తులకు శిక్షలు పడే విధంగా కోర్టు డ్యూటీ అధికారులు విధులు నిర్వహించాలన్నారు. నాన్ బేలబుల్ వారెంట్స్ పై  పెండింగ్ ఎందుకు ఉందో క్లుప్తంగా అడిగి తెలుసుకుని ఎగ్జిక్యూటివ్ గురించి తగు సూచనలు సలహాలు చేశారు. పోక్సో  క్రైమ్ అగ్నిస్ట్ ఉమెన్ కేసులలో ఉన్న ప్రాపర్టీని త్వరగా కోర్టులో డిపాజిట్ చేయాలని తెలిపారు. ఫోక్సో ఎస్సీ ఎస్టీ కేసులలో  ట్రాయల్ సమయంలో సంబంధిత ఇన్వెస్టిగేషన్ అధికారులు తప్పకుండా మానిటర్ చేయాలని సూచించారు. కోర్టు అధికారులతో సంబంధిత ఏపీపీ, మరియు పిపిలతో మంచి లైజనింగ్ ఏర్పరచుకొని విధులు నిర్వహించాలని సూచించారు. క్రమం తప్పకుండా కోర్టుకు వెళ్లాలని సూచించారు. చార్జిషీట్ కోర్టులో దాఖలు చేసేటప్పుడు సంబంధిత పేపర్లు అన్నీ ఒకసారి చెక్ చేసుకుని దాఖలు చేయాలని చెప్పారు. కోర్టు డ్యూటీ వర్టికల్ లో పారదర్శకంగా విధులు నిర్వహించే వారికి రివార్డులు అవార్డులు అందజేస్తామని తెలిపారు. సమన్స్, వారెంట్ మరియు కోర్టు డిస్పోజల్ కన్వెక్షన్, కాంప్రమైజ్, అక్విట్ తదితర సమాచారాన్ని ప్రతి రోజు సిసిటిఎన్ఎస్ లో డాటా ఎంట్రీ చేయాలని సూచించారు, సమస్స్, వారెంట్స్ పెండింగ్ లేకుండా చూడాలని తెలిపారు,  ప్రతి శనివారం పోలీస్ స్టేషన్లో  సిడిఓ  మీటింగ్ నిర్వహించి గత వారం నుండి కోర్టులో జరిగిన ట్రాయల్స్, అక్విటైన కేసుల గురించి,  శిక్షలు పడ్డ కేసుల గురించి, సమన్స్, వారెంట్, ఎగ్జిక్యూటివ్  మరియు ఇన్వెస్టిగేషన్లో ఏమైనా  పొరపాట్లు ఉంటే  ప్రతి ఒక్కరికి తెలియపరచాలని సూచించారు. ఎఫ్ఐఆర్ నుండి చార్జిషీట్ వరకు ప్రతి ఒక్కటి సక్రమంగా ఉండేటట్లు మానిటర్ చేయాలని సూచించారు. తప్పకుండా 60 రోజులలో కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయాలి. కోర్టు డ్యూటీ ఆఫీసర్ ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా విధులు నిర్వహించి కన్వెక్షన్ రేటు పెంచాలని సూచించారు. ప్రతి కోర్టు డ్యూటీ అధికారి  నీతి నిజాయితీగా విధులు నిర్వహించాలని సూచించారు. కోర్టు విధులు నిర్వహించే సిబ్బంది ప్రతి ఒక్కరూ నూతన చట్టాల గురించి పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు.
నూతన చట్టాలు భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత బిఎన్ఎస్,  భారతీయ సాక్ష్యా అధినియం బిఎస్ఏ, 2023 నూతన చట్టాల గురించి, ప్రాసెస్, పెండింగ్ ఉన్న నాన్ బెలబుల్ వారెంట్స్, ఆన్లైన్ డాటా గురించి   కోర్టు మానిటర్ ఎస్ఐ నరసింహారావు, సిసిఆర్బి ఇన్స్పెక్టర్ రామకృష్ణ, ఎస్బి ఇన్స్పెక్టర్ కిరణ్, శ్రీధర్, శ్రీధర్ గౌడ్, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా నూతన చట్టాల్లో ఉన్న శిక్షలు గురించి  మరియు కోర్ట్ ప్రాసెస్ గురించి  తదితర అంశాల గురించి అవగాహన కల్పించడం జరిగింది.
ఈ సమావేశంలో కోర్టు విధులు నిర్వహించే కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్లు, ఏఎస్ఐలు, కోర్టు లైజనింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్